Chandrabose: తాను రాసిన పాటకు భావోద్వేగంతో తానే కన్నీరు పెట్టుకున్న చంద్రబోస్.. ఆ సాంగ్ ఏంటంటే..?

పాత్రలు కల్పితం, సందర్భం కల్పితం.. తానే రాసిన పాట.. ఆ పాటకే కన్నీరు పెట్టుకున్నారు రచయిత చంద్రబోస్.. అంత భావుకత ఆ పాటలో నిండి ఉంటుంది. ఆ పాట మిమ్మిల్ని కూడా కదిలించే ఉంటుంది.

Chandrabose: తాను రాసిన పాటకు భావోద్వేగంతో తానే కన్నీరు పెట్టుకున్న చంద్రబోస్.. ఆ సాంగ్ ఏంటంటే..?
Lyricist Chandrabose
Follow us
Ram Naramaneni

| Edited By: Ravi Kiran

Updated on: Mar 17, 2023 | 8:19 PM

అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్‌ ఇండియా వశమైంది. నాటు తెలుగు పాటకు అకాడమీ అవార్డు రావడం మనందరికీ గర్వకారణం. రాజమౌళి రూపొందించిన మ్యాగ్నమ్‌ ఓపస్‌ RRR లో నాటు నాటు పాట అకాడమీ హృదయాన్ని గెలుచుకుంది. ఆ నాటు పాట ఇండియాకు ఆస్కార్‌ తెచ్చిపెట్టింది. ఈ పాటను రాసింది ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్. ఆయన తెలుగు మట్టి నుంచి పుట్టిన ఆణిముత్యం. తెలుగు సాహిత్యానికి అరుదైన గొప్ప ఆస్తి. అవును చంద్రబోస్ ఎన్నో గొప్ప పాటలను రాశారు. ఇలా నాటు మాస్ సాంగ్స్, ఊ అంటావా లాంటి ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాదు.. ఆలోచింపజేసే పాటలు, బ్రతులుకు మార్చే పాటలు రాశారు. హృదయాలు కరిగే సాంగ్స్, కన్నీళ్లు పెట్టించే సాంగ్స్ సైతం ఆయన కలం నుంచి జాలువారాయి. వేటూరి, సిరివెన్నెల తర్వాత అంత భావుకత, ఎమోషన్ నిండిన పాటలను రాయగలిగిన రచయిత చంద్రబోస్. ఎన్నో వేల పాటలను రాసిన చంద్రబోస్.. ఆయన రాసిన పాటకు ఆయనే ఎప్పుడైనా కన్నీరు పెట్టుకున్నారా..? అంటే అవును.. పెట్టుకున్నారట.

ఆ పాట రంగస్థలం సినిమాలోని ఓరయ్యో.. నా అయ్య పాట. అది ఆయనే పాడటం మరో విశేషం. ఈ పాటను ఆయన దుబాయ్‌లో రాశారు. అక్కడే రెంపరరీగా ఆయన వాయిస్‌తోనే రికార్డింగ్ చేయించారు మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. ఆపై ఆయన ఇండియా వచ్చేశారు. ఇంటికి వచ్చిన తర్వాత చంద్రబోస్ శ్రీమతి సుచిత్ర.. దుబాయ్‌లో ఏమైనా రాశారా అని అడిగారట. అప్పుడు భావోద్వేగంతో పాట పాడి వినిపించారట.. చంద్రబోస్. ఆ సమయంలో ఆమె వంట చేస్తూ ఉన్నారట. 2 పల్లవులు పాడిన అనంతరం ఆమె వైపు చూడగా సుచిత్ర ఏడుస్తూ కనిపించారట. ఆ సమయంలో తన హృదయం నుంచి కూడా దు:ఖం తన్నుకొచ్చి.. కన్నీరు పెట్టుకున్నారట. అప్పుడే ఈ సాంగ్ అందర్నీ కదిలించబోతుందని ఆయన నమ్మారట. అదే జరిగింది. సినిమాలో పాట చాలామంది కన్నీళ్లు పెట్టించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..