Love Mouli Movie Review: లవ్ మౌళి రివ్యూ.. నవదీప్ ప్రేమకథ ఎలా ఉందంటే..

అప్పుడప్పుడు 20 సంవత్సరాల కింద జై సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు నవదీప్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత నవదీప్ 2.0 అంటూ తనను తాను లవ్ మౌళి సినిమాతో కొత్తగా పరిచయం చేసుకున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులకు నచ్చిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Love Mouli Movie Review: లవ్ మౌళి రివ్యూ.. నవదీప్ ప్రేమకథ ఎలా ఉందంటే..
Love Mouli Review
Follow us

| Edited By: Rajitha Chanti

Updated on: Jun 07, 2024 | 4:40 PM

మూవీ రివ్యూ: లవ్ మౌళి

నటీనటులు: నవదీప్, ఫంకూరి గిద్వాని, రానా దగ్గుబాటి (గెస్ట్ అప్పియరెన్స్), మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు

ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అవనీంద్ర

నిర్మాతలు: నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్

అప్పుడప్పుడు 20 సంవత్సరాల కింద జై సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు నవదీప్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత నవదీప్ 2.0 అంటూ తనను తాను లవ్ మౌళి సినిమాతో కొత్తగా పరిచయం చేసుకున్నాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ప్రేక్షకులకు నచ్చిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

మౌళి (నవదీప్) చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోతారు. 14 సంవత్సరాల వయసున్నప్పుడు తనను పెంచిన తాతయ్య కూడా దూరం అవుతాడు. దాంతో మనుషులకు దూరంగా పెయింటింగ్స్‌కు దగ్గరగా బతుకుతుంటాడు. తన ఫీలింగ్స్ ఏమున్నా కూడా కేవలం పెయింటింగ్స్ రూపంలోనే చెప్తుంటాడు. అసలు ప్రేమ అంటే ఏంటి.. ఎలా ఉంటుంది అనేది కూడా మౌలికి తెలియదు. నేను అనే ప్రపంచంలోనే బతికేస్తూ ఉంటాడు. తనను తాను మాత్రమే ప్రేమిస్తుంటాడు. అలాంటి మౌళి జీవితంలోకి అనుకోకుండా ఒక స్వామీజీ (రానా దగ్గుబాటి) వస్తాడు. తనకు నిజమైన ప్రేమ చూడాలని ఉంది అని ఆ స్వామిని మౌళి అడగడంతో.. ఒక వరం ఇస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తనకు ఎలాంటి అమ్మాయి కావాలో అని ఊహించుకొని ఎప్పటిలాగే మౌళి ఒక పెయింటింగ్ వేస్తాడు. తెల్లవారేసరికి ఆ బొమ్మ చిత్ర (ఫంకూరీ గిద్వాని) అనే అమ్మాయి రూపంలో తన ఇంటికి వస్తుంది. అప్పట్నుంచి మౌళి జీవితంలో ఏం జరిగింది..? అసలా అమ్మాయి అక్కడికి ఎలా వచ్చింది..? అనేది మిగిలిన కథ..

కథనం:

సినిమా చూడ్డానికి థియేటర్లోకి వెళితే ఓ మంచి పెయింటింగ్ కనిపిస్తే ఎలా ఉంటుంది.. లవ్ మౌళి సినిమా చూస్తే అలాగే అనిపిస్తుంది. కథ ఏంటి.. సినిమా ఎలా ఉంది.. చూడొచ్చా.. ఇలాంటి రొటీన్ ప్రశ్నలు పక్కన పెడితే.. అందమైన రంగుల ప్రపంచంలా ఉంది లవ్ మౌళి సినిమా. కథ పరంగా ఈ సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ.. కానీ అందమైన దృశ్య కావ్యంలా ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు అవనీంద్ర. టెక్నికల్‌గా చూస్తే మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది లవ్ మౌళి. జీవితంలో మనం కోరుకునే ప్రేమలో మన స్వార్థమే ఎక్కువగా ఉంటుంది. మనకు నచ్చిన మనిషి అన్నీ మనకు నచ్చినట్టుగానే చేయాలి అనుకుంటాం. ఒక్కోసారి అవతల వాళ్ళ ఇష్టాలను కూడా పట్టించుకోము. ఇదే విషయాన్ని పోయేటిక్ గా చెప్పాలని చూసాడు దర్శకుడు అవనీంద్ర. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా.. ఆఫ్ బీట్ మూవీలా చేశాడు. తన మనసులోని భావాలను కథ రూపంలో కాకుండా బొమ్మల్లా చూపించాడు. లవ్ మౌళి అందరికీ నచ్చే సినిమా కాకపోవచ్చు. కమర్షియల్ గా దీనికి డబ్బులు వచ్చేది కూడా కష్టమే. కానీ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ పరంగా లవ్ మౌళి అత్యున్నతంగా ఉంది. సాంకేతిక కోణంలో ఈ సినిమాను చూస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా ఫస్టాఫ్ కాస్త స్లోగా అనిపిస్తుంది కానీ సెకండాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. మరీ ముఖ్యంగా తనను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేని అమ్మాయి కావాలని కోరుకున్నపుడు.. నవదీప్‌కు ఎదురయ్యే కష్టాలు ఫన్నీగా అనిపిస్తాయి. ఆ తర్వాత వచ్చే సీన్స్ కూడా బాగానే రాసుకున్నాడు దర్శకుడు. అయితే క్లైమాక్స్ మాత్రం ఊహించినంత కన్విన్సింగ్‌గా ఇవ్వలేకపోయాడు. దానికి తోడు కొన్ని లాజిక్స్‌కు అందని సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఎలాంటి లాజిక్స్ పట్టించుకోకుండా చూస్తే మాత్రం లవ్ మౌళి పర్లేదు అనిపిస్తుంది. ఫ్యామిలీస్ కంటే యూత్‌కు బాగా ఎక్కే సినిమా ఇది. ఎందుకంటే ఇందులో బోల్డ్ సన్నివేశాలు కూడా బోలెడున్నాయి. వాటిని ప్రేమతో ముడిపెట్టి చూపించాడు దర్శకుడు అవనీంద్ర.

నటీనటులు:

నవదీప్ తనను తాను కొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేసుకున్నాడు. నటనలోనూ పరిణతి చూపించాడు. ఫిజికల్‌గానూ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అనే విషయం స్క్రీన్ మీద చూస్తుంటేనే అర్థమవుతుంది. హీరోయిన్ పంకూరి గిద్వానికి మంచి క్యారెక్టర్ పడింది. కెరీర్ మొదట్లోనే ఇలాంటి కారెక్టర్ పడటం నిజంగానే అదృష్టం. ఇక హేమంత్, కిరణ్ లాంటి నటులు పర్లేదనిపించారు. ఇందులో చాలా వరకు కొత్త నటీనటులు కనిపించారు.

టెక్నికల్ టీం:

గోవింద్ వసంత్ ఇచ్చిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. పాటలు బాగున్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ లవ్ మౌళి సినిమాకు ప్రాణం. మేఘాలయ అందాలను చాలా బాగా క్యాప్చర్ చేసారు. అలాగే ఎడిటింగ్ కూడా పర్లేదు అనిపిస్తుంది. ఇక దర్శకుడు అవనీంద్ర తన ఆల్ రౌండ్ టాలెంట్ చూపించాడు. ఆలోచన బాగుంది కానీ ఆచరణ ఇంకాస్త బాగుండుంటే ఇంకా బాగుండేది సినిమా. దర్శకుడిగానే కాకుండా.. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాద్యతలు కూడా తీసుకున్నాడు ఈయన. రాజమౌళి దగ్గర పని చేసిన అనుభవం ఉండి కూడా.. ఇలాంటి కథ ఎంచుకోవడం విభిన్నంగా అనిపిస్తుంది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా లవ్ మౌళి.. మంచి పెయింటింగ్.. చూసే కళ్ళను బట్టి..!

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్