Tollywood News: అప్డేట్ ఏది బాస్.. ఆ కుర్ర హీరోలు ఎందుకు సైలెంట్ అయ్యారు..

లక్ష్య, వరుడు కావలెను సినిమాలతో ప్రేక్షకులను అలరించారు యంగ్ హీరో నాగశౌర్య. ఈ రెండు చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ హీరో చేతిలో

Tollywood News: అప్డేట్ ఏది బాస్.. ఆ కుర్ర హీరోలు ఎందుకు సైలెంట్ అయ్యారు..
Movies
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 28, 2022 | 11:00 AM

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దక్షిణాది చిత్రాల హవా నడుస్తోంది. పాన్ ఇండియ లెవల్లో విడుదలైన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా రికార్డ్ స్తాయిలో వసూళ్లు రాబట్టాయి. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, విక్రమ్ చిత్రాలు సంచలన విజయం సాధించిన సంగతి తెలసిందే. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమాలు ఎఫ్ 3, అంటే సుందరానికీ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఓవైపు అగ్రహీరోలు వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నప్పటికీ.. ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ సైలెంట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా వారి సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రావడం లేదు. ఓవైపు షూటింగ్స్ శరవేగంగా జరుగుతుండగా.. మరోవైపు చిత్రీకరణలు పూర్తైన రిలీజ్ డేట్స్ మాత్రం అనౌన్స్ చేయడం లేదు. దీంతో యంగ్ హీరోస్ సినిమాలు ఎప్పుడు విడుదల కానున్నాయి అనే విషయాలపై స్పష్టత రావడం లేదు.

లక్ష్య, వరుడు కావలెను సినిమాలతో ప్రేక్షకులను అలరించారు యంగ్ హీరో నాగశౌర్య. ఈ రెండు చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ హీరో చేతిలో మాత్రం ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ హీరో కృష్ణ వ్రిందా విహారి సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పలుమార్లు వాయిదా పడుతూవచ్చింది. ఇక ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో విడదల కానున్నట్లు తెలుస్తోంది.

ఇక మరోవైపు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం కార్తికేయ 2. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. నిఖిల్, అనుపమ కలిసి నటిస్తోన్న సినిమా వచ్చే నెల 12న విడుదల కానుంది. ఇక 18 పేజేస్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అలాగే సుధీర్ బాబు నటిస్తోన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. కృతి శెట్టి కథానాయికగా నటిస్తోన్న ఈ మూవీ ఇప్పిటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ విడుదల తేదీ విషయంలో మాత్రం స్పష్టత రాలేదు.

ఇవి కూడా చదవండి

అలాగే ఇటీవల గాడ్సే సినిమాతో ప్రేక్షకులను అలరించారు హీరో సత్యదేవ్. ఇక మిల్కీబ్యూటీ తమన్నా.. సత్యదేవ్ జంటగా నటిస్తో్న్న గుర్తుందా శీతాకాలం సినిమా. ఇప్పటికే ఎన్నోసార్లు విడుదల తేదీ ప్రకటించినప్పటికీ అనుహ్యంగా వాయిదా పడుతూ వచ్చింది. అలాగే తేజ సజ్జా నటిస్తోన్న హను మాన్, సమంత నటించిన శాకుంతలం, అనుపమ ప్రధాన పాత్రలో బటర్ ఫ్లై, రెజీనా, నివేధా థామస్ నటిస్తోన్న శాకినీ ఢాకినీ చిత్రాల నుంచి అప్డేట్స్ రావాల్సి ఉంది. మొత్తానికి సంక్రాంతికి ఈ చిత్రాలన్ని థియేటర్లలో సందడి చేయనున్నట్లుగా తెలుస్తున్నాయి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!