AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lavanya Tripathi: వరుణ్ తేజ్‏తో మళ్లీ కలిసి నటిస్తారా ?.. లావణ్య రియాక్షన్ ఇదే..

మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. చాలాకాలం పాటు వీరి ప్రేమ సంగతి బయటకు రాలేదు. కానీ గతేడాది జూన్‏లో వీరి నిశ్చితార్థంతో అధికారికంగా ప్రేమ విషయాన్ని తెలిపారు. గతేడాది నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలో జరిగింది. అయితే పెళ్లి తర్వాత లావణ్ నటిస్తోన్న మొదటి వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్'. ఈ సిరీస్ తెలుగు హిందీ భాషల్లో వచ్చే నెల 2నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న లావణ్య.. వి

Lavanya Tripathi: వరుణ్ తేజ్‏తో మళ్లీ కలిసి నటిస్తారా ?.. లావణ్య రియాక్షన్ ఇదే..
Lavanya, Varun Tej
Rajitha Chanti
|

Updated on: Jan 24, 2024 | 10:50 AM

Share

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది లావణ్య త్రిపాఠి. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి అలరించింది. గతేడాది మెగా హీరో వరుణ్ తేజ్‏తో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. చాలాకాలం పాటు వీరి ప్రేమ సంగతి బయటకు రాలేదు. కానీ గతేడాది జూన్‏లో వీరి నిశ్చితార్థంతో అధికారికంగా ప్రేమ విషయాన్ని తెలిపారు. గతేడాది నవంబర్ 1న వీరి వివాహం ఇటలీలో జరిగింది. అయితే పెళ్లి తర్వాత లావణ్ నటిస్తోన్న మొదటి వెబ్ సిరీస్ ‘మిస్ పర్ఫెక్ట్’. ఈ సిరీస్ తెలుగు హిందీ భాషల్లో వచ్చే నెల 2నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొన్న లావణ్య.. వివాహం తర్వాత తన లైఫ్ గురించి పలు విషయాలను పంచుకున్నారు.

ఇటీవల ‘మిస్ పర్ఫెక్ట్’ ప్రమోషన్లో భాగంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న లావణ్య.. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. మిస్టర్, అంతరిక్షం తర్వాత..ఇప్పుడు దంతులపైన మీరు మళ్లీ కలిసి నటిస్తారా ? అని అడగ్గా.. లావణ్య స్పందిస్తూ.. మంచి కథ ఉంటే తప్పకుండా నటిస్తామని అన్నారు. కానీ అది ఎప్పుడూ జరుగుతుందో తెలియదని.. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందేనని అన్నారు. అలాగే వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ.. తనకు వరుణ్ మంచి లైఫ్ పార్టనర్ అని.. చాలా అంశాల్లో తను పర్ఫెక్ట్ అని.. ఎప్పుడూ తనను ప్రోత్సహిస్తాడని అన్నారు..

ఇక తన నటనను కొనసాగిస్తానని.. మెగా కోడలిగా ఉండడం చాలా స్పెషల్ అని.. నటన విషయంలో అలాంటి వాటిలో నటించు.. ఇలాంటివి వద్దు అనే పరిమితులు తన పేరెంట్స్ ఎప్పుడూ పెట్టలేదని.. ఇటు వరుణ్ ఫ్యామిలీ కూడా అలా చెప్పలేదని.. కానీ సినిమాల ఎంపిక విషయంలో తనకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయని.. ఇంతకు ముందు ఎలాంటి సినిమాలు చేశానో.. అలాంటి వాటిలో నటిస్తానని అన్నారు లావణ్య. ఇప్పుడు ఆమె నటించిన ‘మిస్ పర్ఫెక్ట్’ సిరీస్ లో బిగ్ బాస్ ఫేమ్ అభిజిత్ కీలకపాత్ర పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.