AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Rashmi: ‘డబ్బులు ఎగ్గొట్టానా ?.. ఆకృత్యాలు చేశానా ?’.. నెటిజన్ పై యాంకర్ రష్మీ సీరియస్..

లాగే సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. అలాగే సమాజంలో జంతువులపై జరిగే దాడులపై స్పందిస్తుంటుంది. అయితే ఆమె మీద ఎప్పుడూ నెట్టింట ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇక తనపై వచ్చే విమర్శకులకు కూడా గట్టిగానే ఆన్సర్ ఇస్తుంది. ఇటీవల కొద్దిరోజులుగా అయోధ్య రామమందిరం, హిందుత్వం గురించి అనేక పోస్టులు పెడుతుంది రష్మీ.

Anchor Rashmi: 'డబ్బులు ఎగ్గొట్టానా ?.. ఆకృత్యాలు చేశానా ?'.. నెటిజన్ పై యాంకర్ రష్మీ సీరియస్..
Rashmi Gautham
Rajitha Chanti
|

Updated on: Jan 24, 2024 | 1:18 PM

Share

బుల్లితెరపై యాంకర్ రష్మీ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది. అలాగే సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. అలాగే సమాజంలో జంతువులపై జరిగే దాడులపై స్పందిస్తుంటుంది. అయితే ఆమె మీద ఎప్పుడూ నెట్టింట ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇక తనపై వచ్చే విమర్శకులకు కూడా గట్టిగానే ఆన్సర్ ఇస్తుంది. ఇటీవల కొద్దిరోజులుగా అయోధ్య రామమందిరం, హిందుత్వం గురించి అనేక పోస్టులు పెడుతుంది రష్మీ. అయితే ఇటీవల అయోధ్య రామందిరం ప్రారంభం గురించి సంతోషం వ్యక్తం చేస్తూ ఈ పోస్ట్ చేసింది రష్మీ. అయితే ఆ వీడియోపై సైతం పలువురు నెటిజన్స్ కౌంటర్స్ వేశారు. తాజాగా ఓ నెటిజన్‍కు గట్టి కౌంటరిచ్చింది రష్మీ.

ఇటీవల కాషాయపు రంగు చీర అంటూ రష్మీ పెట్టిన వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ అసభ్యకరంగా కామెంట్ చేశాడు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ హద్దులు దాటు మరీ కామెంట్ చేశాడు. దీంతో సీరియస్ అయిన రష్మీ.. అతడికి గట్టిగానే ఇచ్చిపడేసింది.

“నేను బిల్లులు కట్టకుండా ఎగ్గొట్టానా ?.. నా తల్లిదండ్రులను రోడ్డున వదిలేశానా ?.. నా కుటుంబ బాధ్యతలు తీసుకోలేదా ?.. ట్యాక్సులు కట్టలేదా ?.. నేనేమైనా అసాంఘిక కార్యకలాపాలు, ఆకృత్యాలు చేశానా ?.. ఎవరి దగ్గరైనా డబ్బులు లాగేసుకున్నానా ?.. మీరు అంటున్న ఆ పదానికి అసలైన అర్థం ఏంటీ ?.. పదే పదే ఈ పదంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. కాషాయపు రంగు చీరకట్టి, జై శ్రీరాం అని నినదాలు చేసుకుంటూ ఉంటే నన్నెందుకు రెచ్చగొడుతున్నారు. దేవుడు అందరివాడు. అదే సనాతన ధర్మం గొప్పదనం. ధర్మాన్ని, కర్మను బ్యాలెన్స్ చేయడంతో ఆధ్యాత్మికలోని గొప్పదనం” అంటూ ట్వీట్ చేసింది రష్మి. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. రష్మీకి మద్దతు తెలుపుతున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.