Hero Yash Birthday: రాకింగ్ స్టార్ యశ్ పుట్టిన రోజు నేడు..
యష్‌బాస్ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ' టాక్సిక్' సినిమా నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ కూడా యష్‌కి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది. ఈరోజు ఈ సినిమా కొత్త అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'టాక్సిక్' చిత్రానికి కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యశ్. నేడు ఈ రాకింగ్ స్టార్ యశ్ పుట్టిన రోజు. యశ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆయకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక యశ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ టాక్సిక్. యష్‌బాస్ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ‘ టాక్సిక్’ సినిమా నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ కూడా యష్‌కి తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపింది. ఈరోజు ఈ సినిమా కొత్త అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘టాక్సిక్’ చిత్రానికి కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.
పాన్ ఇండియా మూవీ అయిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. ఈ సినిమా పోస్టర్‌ని యశ్ పుట్టినరోజున విడుదల చేస్తారా అని అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టాక్సిక్ ప్రొడ్యూసర్స్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు.
కెవిఎన్ ప్రొడక్షన్స్ ట్విట్టర్ లో. యష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. గతంలో విడుదల చేసిన మోషన్ పోస్టర్ ను మళ్లీ విడుదల చేశారు. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ లుక్ అప్ డేట్ ఇవ్వండి’ అని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. మరికొందరు మేకింగ్ వీడియో రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేజీఎఫ్ లాంటి బిగ్ సినిమా తర్వాత యశ్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. యశ్ ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి.
Happy Birthday to the man who rocks our screens and our hearts! ❤️🔥@TheNameIsYash! 🤘#HBDRockingStarYash #HappyBirthdayYash#TOXIC #TOXICTheMovie #GeetuMohandas @KVNProductions @Toxic_themovie pic.twitter.com/kXu8jO95KS
— KVN Productions (@KvnProductions) January 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.