Krithi Shetty: కృతి శెట్టి ధాటి తట్టుకోలేకపోతున్న రష్మిక మందన.. అసలు విషయం ఏంటంటే

వరుస విజయాలు వస్తున్న సమయంలో బాలీవుడ్ వెనకబడి ఇక్కడ ఉన్న ఇమేజ్ కూడా పూర్తిగా పాడు చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. గతంలో కొందరు సీనియర్ హీరోయిన్లు చేసిన తప్పుని రష్మిక కూడా రిపీట్ చేసింది అంటున్నారు

Krithi Shetty: కృతి శెట్టి ధాటి తట్టుకోలేకపోతున్న రష్మిక మందన.. అసలు విషయం ఏంటంటే
Krithi Shetty, Rashmika Mandanna
Follow us

|

Updated on: Mar 14, 2023 | 7:05 PM

కెరీర్ ఎలా మొదలుపెట్టామని కాదు.. ఎలాంటి సమయంలో ఏ నిర్ణయాలు తీసుకున్నామనేది కీలకం. ఈ విషయంలో రష్మిక మందన పూర్తిగా ఫెయిల్ అయిందన్న విషయం ఆమె కెరీర్ తీరు చూస్తుంటే ఈజీగానే అర్థమవుతుంది. వరుస విజయాలు వస్తున్న సమయంలో బాలీవుడ్ వెనకబడి ఇక్కడ ఉన్న ఇమేజ్ కూడా పూర్తిగా పాడు చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. గతంలో కొందరు సీనియర్ హీరోయిన్లు చేసిన తప్పుని రష్మిక కూడా రిపీట్ చేసింది అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం తెలుగులో ఈమె హవా ఏ మాత్రం కనిపించడం లేదు. అల్లు అర్జున్ పుష్ప 2 మినహాయిస్తే రష్మిక చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. బాలీవుడ్‌లో కూడా ఈమె పరిస్థితి అగమ్య గోచరంగానే మారిపోయింది. అక్కడ చేసిన మొదటి సినిమా గుడ్ బై డిజాస్టర్ అయింది.. రెండో సినిమా మిషన్ మజ్ను ఓటీటీలో విడుదలైంది. దానికి కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు.

సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కూడా ఆ సినిమా ఫోకస్ అంత రణ్‌బీర్ కపూర్, సందీప్‌పైనే ఉంది తప్ప రష్మిక మీద మాత్రం కాదు. పైగా మొన్న సంక్రాంతికి నటించిన వారసుడు సినిమాలో రష్మిక పాత్ర 15 నిమిషాలు కూడా లేదు. అది చూసి రష్మిక ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ఆ సినిమా కేవలం తాను విజయ్ కోసమే ఒప్పుకున్నానని.. కథ కోసం కాదు అంటూ ఆమె చెప్పింది. ఇదిలా ఉంటే తెలుగులో రష్మిక పోటీగా యంగ్ హీరోయిన్స్ చాలా మంది వచ్చేశారు. మరీ ముఖ్యంగా కృతి శెట్టి నుంచి రష్మికకు పెద్ద ముప్పే ఉంది. కృతి వయసు 20 ఏళ్లు మాత్రమే. ఈమె కెరీర్‌కి ఇంకా చాలా టైం ఉంది. పైగా కెరీర్ మొదట్లో వరుస విజయాలు అందుకుని క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది కృతి. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తున్న కస్టడీ సినిమాలో నటిస్తుంది కృతి శెట్టి. గతంలో ఈ ఇద్దరు కలిసి నటించిన బంగార్రాజు సినిమా మంచి విజయం సాధించింది. దాంతో కష్టడిపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.

అన్నింటికీ మించి వెంకట్ ప్రభు తమిళంలో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సినిమా మే 12న విడుదల కానుంది. కచ్చితంగా దాంతో కృతి క్రేజ్ మళ్లీ పెరిగిపోవడం ఖాయం. పైగా తెలుగుతో పాటు మలయాళంలోనూ నటిస్తుంది ఉప్పెన సుందరి. అక్కడా ఇక్కడా అన్ని చోట్లా తన హవా చూపిస్తుంది. ఇదే జోరులో రెండు విజయాలు వచ్చాయంటే మాత్రం కృతి దెబ్బకు రష్మిక కెరీర్ పూర్తిగా ఖతమ్ అవ్వడం ఖాయమేమో..? పైగా రష్మికతో ఇప్పటికే స్టార్స్ నటించారు. దాంతో ఈమె కంటే దర్శక నిర్మాతల కన్ను కృతిపైనే ఎక్కువగా ఉంది. ఫ్రెష్ కాంబినేషన్స్ ఉంటే బాగుంటుంది అనేవాళ్లకు రష్మిక కంటే కృతి బెటర్ ఆప్షన్ అనడంలో ఎలాంటి సందేహం లేదేమో..?