పవన్ ఫ్యాన్స్‌కి బొనాంజా న్యూస్..అదిరిపోయే కథతో రీ ఎంట్రీ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. మొదట్లో చేయనని తన ఫోకస్ మొత్తం రాజకీయాల మీదే ఉందని కొంచెం బెట్టు చేసినా, అభిమానుల ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే.. ఈ విషయంగా స్వయంగా రాంచరణ్ క్లారిటీ ఇచ్చేసాడు కాబట్టి. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న చెర్రీ మాట్లాడుతూ.. ”  కళ్యాణ్ బాబాయ్ తిరిగి సినిమాల్లో నటిస్తారా లేదా అని చాలా మంది […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:55 pm, Mon, 28 October 19
పవన్ ఫ్యాన్స్‌కి బొనాంజా న్యూస్..అదిరిపోయే కథతో రీ ఎంట్రీ..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. మొదట్లో చేయనని తన ఫోకస్ మొత్తం రాజకీయాల మీదే ఉందని కొంచెం బెట్టు చేసినా, అభిమానుల ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నామంటే.. ఈ విషయంగా స్వయంగా రాంచరణ్ క్లారిటీ ఇచ్చేసాడు కాబట్టి. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న చెర్రీ మాట్లాడుతూ.. ”  కళ్యాణ్ బాబాయ్ తిరిగి సినిమాల్లో నటిస్తారా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. అయితే ఆయన కథలైతే వింటున్నారు. కానీ ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు…” అంటూ అభిమానులకి కావాల్సిన అప్డేట్ ఇచ్చేసాడు. సో పవన్ రీ ఎంట్రీ గ్యారంటీ అని చరణ్ మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు.
రీ ఎంట్రీ అయితే కన్ఫర్మ్ చేసాడు కానీ ఎవరితో చేస్తున్నాడు, ఏ రకమైన సినిమా చేస్తున్నాడన్న విషయాలు మాత్రం బయటకు రాలేదు. కొన్ని రోజుల నుంచి పలానా డైరెక్టర్, పలానా ప్రొడ్యూసర్ అని రూమర్స్ అయితే వస్తున్నాయి. తాజాగా టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ క్రిష్ దర్శకత్వంలో సినిమాతో పవన్ తన రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని ఫిల్మ్‌నగర్ నుంచి ఇన్పర్మేషన్ అందుతోంది. ఈ సినిమా కూడా ఆషామాషీగా ఉండదని, భారీ బడ్జెట్ లో జానపద జోనర్ లో ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం క్రిష్ స్క్రిప్ట్ కు ఫైనల్ టచ్ ఇస్తున్నట్లు సమాచారం. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక క్రిష్ పవన్ కు ఫుల్ నరేషన్ ఇస్తాడట. అది కనుక ఓకే అయితే ఇక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేసినట్లే. ఇప్పటివరకూ పవన్ జానపద జోనర్ ను టచ్ చేయలేదు. కాబట్టి ఇది చాలా సరికొత్త ప్రయత్నమని చెప్పాలి. అందులో ఈ కథ 100 ఏళ్ల క్రితం జరిగిన కథగా ఉంటుందిట. అంటే పీరియాడిక్ జానపద చిత్రమన్నమాట. మరి పవన్ కు ఇలాంటి ప్రాజెక్ట్ సెట్ అవుతుందా? అందులోనూ రీ ఎంట్రీ తర్వాత చేస్తున్న సినిమా కాబట్టి అంచనాలు డిఫరెంట్ గా ఉంటాయి.  క్రిష్ సెన్సిటీవ్ సినిమాలు తీస్తాడు కాబట్టి..పవన్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాడని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇది పవన్ ఫ్యాన్స్‌కి దివాళి బొనాంజా న్యూస్.