AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ajith Kumar: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన అజిత్ సతీమణి.. ఫస్ట్ ఫోస్ట్ ఏం చేసిందో తెలుసా..

ఎన్నో సినిమాల్లో బాలనటిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది షాలిని. అజిత్ తో పెళ్లి తర్వాత షాలిని పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పింది.

Ajith Kumar: సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన అజిత్ సతీమణి.. ఫస్ట్ ఫోస్ట్ ఏం చేసిందో తెలుసా..
Shalini Ajith
Rajitha Chanti
|

Updated on: Nov 27, 2022 | 7:52 PM

Share

ప్రస్తుతం ప్రపంచం మొత్తం సోషల్ మీడియాపై ఆధారపడిపోయింది. ఇన్ స్టా.. ఫేస్ బుక్ , ట్విట్టర్ ద్వారా సెలబ్రెటీస్.. సాధారణ ప్రజల మధ్య కమ్యూనికేషన్ పెరిగింది. సో,ల్ మీడియా ద్వారా డైరెక్ట్ తమ అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతున్నారు సెలబ్రెటీస్. అంతేకాదు… తమ సినిమా అప్డేట్స్.. ఫ్యామిలీ విషయాలను నెట్టింట షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటున్నారు. ఇక కొన్నిసార్లు ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు.. వారి సందేహాలకు తమదైన శైలీలో వివరణ ఇస్తున్నారు. అయితే ఓవైపు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంటే.. మరికొందరు నటీనటులు మాత్రం నెట్టింటికి దూరంగా ఉంటున్నారు. అందులో తమిళ్ స్టార్ హీరో అజిత్ ఒకరు. పాన్ ఇండియా లెవల్లో ఎంతో క్రేజ్ ఉన్న ఈ స్టా్ర్ హీరో ఎక్కువగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. అలాగే ఆయన సతీమణి హీరోయిన్ షాలిని కూడా. ఎన్నో సినిమాల్లో బాలనటిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది షాలిని. అజిత్ తో పెళ్లి తర్వాత షాలిని పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పింది.

తాజాగా షాలిని సోషల్ మీడియాలోకి అడుగు పెట్టింది. ఇన్ స్టాలో షాలిని ఖాతా ఓపెన్ చేసింది. shaliniajithkumar2022 ఐడీతో ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇచ్చంది. ముందుగా తన భర్త అజిత్‏తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఇక నెట్టింట్లో అడుగు పెట్టిన షాలినిని అప్పుడే 50వేల మంది ఫాలో అవుతున్నారు. ఇక తొందరగానే ఈ సంఖ్య మరింత పెరగడం ఖాయం. షాలిని ఇన్ స్టాలోకి ఎంట్రీ ఇవ్వడంతో.. ఆమె చెల్లెల్లు హీరోయిన్ షామిలి కంగ్రాంట్స్ తెలిపింది.

ఇవి కూడా చదవండి
Shalini

Shalini

ఇక ప్రస్తుతం అజిత్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తుణివు. ఈ సినిమాను బోనీ కపూర్ నిర్మిస్తుండగా.. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.