
పై ఫొటోలో డ్యాన్స్ చేస్తోన్న పాపను గుర్తు పట్టారా? ఈ చిన్నారి ఇప్పుడు పాన్ ఇండియాను ఏలుతోన్న టాలీవుడ్ హీరోయిన్. 2005లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కెరీర్ ప్రారంభంలో పెద్దగా గుర్తింపు లేని సినిమాల్లో నటించింది. కానీ ఒకే ఒక్క సినిమా ఈ అమ్మడి తలరాతను మార్చేసింది. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు కల్పించింది. దెబ్బకు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మెగాస్టార్ పవన్ కల్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, గోపీచంద్ తదితర స్టార్ హీరోల సినిమాల్లో కథానాయికగా యాక్ట్ చేసింది. తమిళ్, హిందీ భాషల్లోనూ స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. ఓ వైపు యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తూనే మరోవైపు సీనియర్ హీరోలతో ఆడిపాడిందీ అందాల తార. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సుమారు 90కు పైగా సినిమాలు చేసిందీ స్టార్ హీరోయన్. తద్వారా సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం పాటు హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తోన్న ముద్దుగుమ్మల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.
సినిమాల సంగతి పక్కన పెడితే ఈ హీరోయిన్ కు లవ్ స్టోరీలు, బ్రేకప్పులు ఎక్కువే. విరాట్ కోహ్లీ, అబ్దుల్ రజాక్ వంటి స్టార్ క్రికెటర్లతోనూ ఈ ముద్దుగుమ్మ ప్రేమాయణం నడిపిందని రూమర్లు వచ్చాయి. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ తోనూ డేటింగ్ చేసిందని ప్రచారం జరిగింది. ఇక ఓ బాలీవుడ్ నటుడితో బహిరంగంగానే చెట్టపట్టాలేసుకుని తిరిగిందీ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు ఆ లవ్ కూడా బ్రేకప్ అయ్యింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్.. తను మరెవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.
The audience’s applause for “Dheevara” roared like an ocean 💥🔥🥳👑💖🥰😍#Dheevara #BaahubaliTheEpic#Prabhas @tamannaahspeaks@BaahubaliMovie @PrasadsCinemas #pcx pic.twitter.com/u5dzrSITri
— Karthik (@withluv_karthik) November 3, 2025
ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాల్లో నటించింది తమన్నా. ఓదెల 2లో మెయిన్ లీడ్ లో మెరిసిన ఆమె బాలీవుడ్ రైడ్ 2లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ప్రస్తుతం ఈ మిల్కీ బ్యూటీ చేతిలో అరడజనకు పైగా సినిమాలున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.