భరణి కోసం నన్ను బలిపశువును చేస్తారా ?? బిగ్ బాస్‌పై శ్రీజ షాకింగ్ కామెంట్స్
బిగ్‍బాస్ సీజన్ 9లో కామనర్ గా అడుగుపెట్టి టాస్కులలో ఆడపులిగా చెలరేగింది దమ్ము శ్రీజ ఇప్పుడో వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు బిగ్ బాస్ హౌస్‌లో అన్యాయం జరిగిదంటూ చెబుతోంది. దమ్ము శ్రీజ. తన ఆట తీరుతో జనాలకు దగ్గరయ్యింది. కానీ ఊహించని విధంగా అడియన్స్ ఓటింగ్ తో సంబంధమే లేకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీల నిర్ణయంతో శ్రీజ ఎలిమినేట్ అయింది.
దీంతో ఆమెది అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని..తనకు రీఎంట్రీ ఛాన్స్ ఇవ్వాలంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే శ్రీజ రీఎంట్రీ పేరుతో హడావిడి చేసిన బిగ్ బాస్.. తన స్టైల్లో ఓ మెలిక పెట్టాడు. శ్రీజతో పాటే భరణిని కూడా హౌస్‌లోకి తీసుకొచ్చి.. వీరిద్దరి మధ్య టాస్కులు పెట్టి.. నెగ్గిన వారే హౌస్‌లో ఉంటారంటూ చెప్పాడు.కానీ చివరకు ఆడియన్స్ ఓటింగ్ అంటూ మాట మార్చి.. భరణికి ఎక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టి.. శ్రీజ ఎలిమినేట్ అంటూ అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలోనే హౌస్ నుంచి బయటికి వచ్చిన శ్రీజ బిగ్‍బాస్ పై సంచలన కామెంట్స్ చేస్తూ ఓ వీడియోను బయటికి వదిలింది. ఇంతకీ ఆ వీడియోలో శ్రీజ ఏం మాట్లాడిందంటే… “నన్ను ఎలమినేట్ చేసిన విధానం నాకు చాలా బాధగా అనిపించింది. స్టేజ్ మీదకు వెళ్లేవరకు నాకు ఏం అర్థం కాలేదు. ఏదైనా సీక్రెట్ టాస్క్ ఇస్తున్నారేమో.. లేదా నన్ను సీక్రెట్ రూంలో పెడుతున్నారేమో అనుకున్నాను. కానీ వెంటనే బజ్ ఇంటర్వ్యూ ఉంది అని చెప్పి షాకిచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాను. తర్వాత బిగ్‍బాస్ ఎపిసోడ్స్ కూడా ఏం చూడలేదు. మళ్లీ బిగ్‍బాస్ టీమ్ వాళ్లే ఇలా నామినేషన్స్ చేయడానికి హౌస్ లోకి వెళ్లాలి రమ్మని పిలిచారు. వెళ్లేవరకూ మాకు రీఎంట్రీ ఉందని చెప్పలేదు. తర్వాత హోటల్లో ఉండగా రీఎంట్రీ ఉంటుందన్నారు.కానీ తీరా స్టూడియోకు వెళ్లాక అక్కడ భరణి గారు ఉండడం చూసి షాకయ్యాను. నన్ను ఆడియన్స్ ఓటింగ్ తో సంబంధం లేకుండా ఎలిమినేట్ చేశారు. అందుకే నన్ను పిలిచారు అనుకున్నాను. కానీ భరణి గారిని ఎందుకు రీఎంట్రీకి పిలిచారు.. అలా అయితే మిగిలిన వాళ్లను కూడా పిలవాలి కదా.. మేము ఇద్దరం లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ గేట్ దగ్గర ఉన్న వాళ్లు భరణి గారికి హింట్ ఇచ్చారు. అప్పుడే నేను అనుకున్నా నన్ను మళ్లీ పంపిస్తారని. అలాగే జరిగింది! నా ఎలిమినేషన్ వల్ల వచ్చిన మరకను వదిలించుకోవడానికి నన్ను మళ్లీ పిలిచి నాటకం ఆడారు. భరణి రీఎంట్రీ కోసం నన్ను బలి పశువును చేశారు. కనీసం రెండోసారి కూడా ఎలాంటి AV లేకుండానే నన్ను పంపించేశారు. ఇది న్యాయమా.. నా జర్నీ వీడియో మాత్రం ఇవ్వండి చాలు” అంటూ భావోద్వేగానికి గురైంది శ్రీజ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss Madhuri: మాధురి రెమ్యూనరేషన్ ఎంతంటే ??
Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్‌కు ఛాన్స్ అంటే.. లైంగిక వేధింపులను లైసెన్స్ ఇచ్చినట్లే
Allu Arjun: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌పై అల్లు అర్జున్ ఎమోషనల్
Allu Sirish: నితిన్ భార్య వల్లే.. ప్రేమలో పడ్డా.. లవ్‌స్టోరీ వివరించిన అల్లు వారబ్బాయి
Bigg Boss 9: తనూజ గుట్టు రట్టు చేశా…అందుకే కక్ష కట్టి బయటికి పంపేశాడు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

