Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్‌కు ఛాన్స్ అంటే.. లైంగిక వేధింపులను లైసెన్స్ ఇచ్చినట్లే
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో అతనికి కొరియోగ్రాఫర్ గా వరుసగా అవకాశాలు వస్తున్నాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో జానీకి ఛాన్సులు వస్తున్నాయి. ఓ లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటోన్న జానీ మాస్టర్ ఇలా వరుసగా సినిమా అవకాశాలు రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నపాయి.
ఈ క్రమంలోనే గతంలో జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణలు చేసిన సింగర్ చిన్మయి ఇప్పుడు మరోసారి అతనిని ఉద్దేశిస్తూ ఒక సంచలన ట్వీట్ పెట్టింది. జానీతో పాటు మరో ప్రముఖ సింగర్ కార్తీక్ పై కూడా తీవ్ర విమర్శలు చేసింది చిన్మయి. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సింగర్ కార్తీక్ లాంటి వాళ్లకు ఛాన్సులు ఇవ్వడం అంటే లైంగిక వేధింపులకు మద్దతు తెలపడమే అవుతుంది. అధికారం, ప్రభావం, డబ్బును దుర్వినియోగం చేసే వారి చేతుల్లో పెట్టవద్దు. మన నమ్మే కర్మ సిద్ధాంతం నిజమైతే.. అది తప్పకుండా వదిలిపెట్టదు.. అని తన ట్వీట్ లో రాసుకొచ్చింది చిన్మయి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. కొందరు ఆమెకు సపోర్టుగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు మాత్రం జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణలు ఇంకా రుజువు కాలేదంటూ చిన్మయిని విమర్శిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌పై అల్లు అర్జున్ ఎమోషనల్
Allu Sirish: నితిన్ భార్య వల్లే.. ప్రేమలో పడ్డా.. లవ్‌స్టోరీ వివరించిన అల్లు వారబ్బాయి
Bigg Boss 9: తనూజ గుట్టు రట్టు చేశా…అందుకే కక్ష కట్టి బయటికి పంపేశాడు
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

