AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండ తగలని జీవితాలు.. ఆ లోపం తో బాధపడుతున్న మెజార్టీ పీపుల్

ఎండ తగలని జీవితాలు.. ఆ లోపం తో బాధపడుతున్న మెజార్టీ పీపుల్

Phani CH
|

Updated on: Nov 04, 2025 | 4:33 PM

Share

నగరాల్లో ప్రజల జీవితాలు ఎండ కన్నే సోకకుండా అయిపోయాయి. ఉదయం ఆఫీసుకు వెళ్లడం మొదలు.. రాత్రి ఇంటికి చేరుకోవడం వరకు ఎక్కడా సూర్యకిరణాలు శరీరానికి తగలడంలేదు. దీంతో మన శరీరంలో స్వతహాగా విటమిన్‌-డి ఉత్పత్తి జరగడంలేదు. దేశంలో 46.5 శాతం మంది ప్రజల్లో విటమిన్‌-డి లోపం ఉందని మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌ అధ్యయనంలో బయటపడింది.

2019 నుంచి 2025 మధ్య 22 లక్షల ల్యాబ్‌ పరీక్షలను విశ్లేషించి వెల్లడించిన ఫలితాల్లో నగర పట్టణ ప్రజల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తోందని తెలిసింది. విటమిన్ డి లోపంతో శరీరం బలహీనమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలలో రికెట్స్ వ్యాధి వస్తుందని, పెద్దవారిలో అయితే అలసట, కీళ్ల నొప్పులు, ఇన్ఫెక్షన్లు సోకడం, జుట్టు ఊడిపోవడం, మానసిక స్థితిలో మార్పులు వస్తాయని అంటున్నారు. కార్బోహైడ్రేట్లు ఎక్కువున్న ఆహారాన్నే తీసుకుంటూ , గుడ్లు వంటివి తక్కువగా తీసుకోవడ కారణంగా చెబుతున్నారు. సూర్యకాంతి వల్ల చర్మం పై పడే యూవీ రేస్‌ని లివర్, కిడ్నీ విటమిన్​ డిగా మారుస్తాయి. విటమిన్ డి కాల్షియం గ్రహించడానికి, ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది. ఉదయం, సాయంత్ర వేళల్లోని సూర్యకాంతిలో యూవీ కిరణాలు విటమిన్ డి తయారీకి పెద్దగా ఉపయోగపడవట. ఎందుకంటే ఆ సమయాల్లో సూర్యుడు 45 డిగ్రీల కోణంలో ఉంటాడు. సూర్యుడి నుంచి సరైన విటమిన్ D పొందడానికి, సూర్యరశ్మికి ఉత్తమ సమయం మధ్యాహ్నం. గుడ్లు, పాలు, పుట్టగొడుగుల్ని ఆహారంలో తీసుకోవడంతో పాటు వైద్యుల సలహాతో సప్లిమెంట్లనీ తీసుకోవాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాంసం వినియోగంలో ఆ దేశం టాప్.. భారత్ చాలా వెనుక

ఈ కొండముచ్చు ఆసనాలు చూస్తే.. యోగా గురువులు కూడా బలాదూర్‌

మలాశయం ద్వారా ఆక్సిజన్‌.. జపనీస్‌ శాస్త్రవేత్తల కొత్త టెక్నిక్‌ !!

వింటర్‌లో వింటేజీ రైలు జర్నీ.. ఈ మార్గంలో ప్రయాణం.. అస్సలు మిస్ కావొద్దు