మాంసం వినియోగంలో ఆ దేశం టాప్.. భారత్ చాలా వెనుక
ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య మాంసం వినియోగంలో భారీ వ్యత్యాసం కనిపించింది. మాంసం ఎక్కువగా తినే దేశాల్లో అమెరికా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచాయి. ఈ దేశాల్లో ఒక్కో వ్యక్తి ఏడాదికి సగటున 110 కిలోలకు పైగా మాంసాన్ని తింటున్న ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ తెలిపింది. మంగోలియా, స్పెయిన్, ఇజ్రాయెల్‌లో కూడా తలసరి మాంసం వినియోగం 100 కిలోల కంటే ఎక్కువగా ఉంది.
ధనిక దేశాలు కావడం, స్థానిక వంటకాల్లో మాంసానికి ప్రాధాన్యత ఉండటం వంటివి ప్రధాన కారణాలు. ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలవి. మాంసం ధరలు అధికంగా ఉండటం, సాంస్కృతిక కారణాల వల్ల వినియోగం చాలా తక్కువ. 2022 సంవత్సరానికి భారత్ డేటా అందుబాటులో లేనప్పటికీ, గత గణాంకాలను పరిశీలిస్తే ఇక్కడ మాంసం వినియోగం ప్రపంచంలోనే అతి తక్కువ. కాంగో, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కూడా ఇదే పరిస్థితి. అలాగే యుద్ధం, సరఫరా సమస్యలతో సతమతమవుతున్న సిరియా, యెమెన్, ఉత్తర కొరియాలో కూడా ప్రజలు మాంసానికి దూరంగా ఉంటున్నారు. అధిక మాంసం వినియోగం పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులను అదుపులో ఉంచాలంటే పశ్చిమ దేశాలు తమ మాంసం వినియోగాన్ని 90 శాతం తగ్గించుకోవాలని ‘నేచర్’ పత్రికలోని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. మాంసం తగ్గించడం ద్వారా ఏర్పడే పోషకాహార లోటును బీన్స్, ఇతర పప్పుధాన్యాలతో భర్తీ చేయాలని సూచించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ కొండముచ్చు ఆసనాలు చూస్తే.. యోగా గురువులు కూడా బలాదూర్
మలాశయం ద్వారా ఆక్సిజన్.. జపనీస్ శాస్త్రవేత్తల కొత్త టెక్నిక్ !!
వింటర్‌లో వింటేజీ రైలు జర్నీ.. ఈ మార్గంలో ప్రయాణం.. అస్సలు మిస్ కావొద్దు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

