Allu Sirish: నితిన్ భార్య వల్లే.. ప్రేమలో పడ్డా.. లవ్‌స్టోరీ వివరించిన అల్లు వారబ్బాయి
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అల్లు శిరీష్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పనున్నారు. ఇటీవలే తాను ఓ అమ్మాయిని ప్రేమించానని సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్ 31న హైదరాబాద్ లోని అల్లు అరవింద్ నివాసంలో అల్లు శిరీష్, నయనికల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీప్రముఖులు, బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు.
ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్, ఉపాసన, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సందడి చేశారు. రీసెంట్‌గా తన ఎంగేజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు అల్లు శిరీష్. అలాగే నయనికతో తన లవ్ స్టోరీని బయటపెట్టారు. దాదాపు రెండేళ్ల క్రితం తనకు కాబోయే భార్య నయనికను చూశానని అసలు విషయం చెప్పుకొచ్చారు. హీరో నితిన్, ఆయన భార్య షాలినితో కలిసి దిగిన ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ తన లవ్ స్టోరీని రివీల్ చేశాడు అల్లు శిరీష్. 2023లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోగా.. నితిన్, షాలిని వాళ్ల పెళ్లికి స్పెషల్ పార్టీ హోస్ట్ చేశారని.. ఆ పార్టీకి షాలిని బెస్ట్ ఫ్రెండ్ నయనిక కూడా వచ్చిందంటూ శిరీష్ తన పోస్టులో రాసుకొచ్చాడు. అలా మొదటిసారి నయనికను అక్కడే కలిశానని.. రెండేళ్ల తర్వాత తాము హ్యాపీగా నిశ్చితార్థం చేసుకుంటున్నమంటూ రాసకొచ్చాడు. భవిష్యత్తులో తన పిల్లలు తన ప్రేమకథ గురించి అడిగితే ఇదే స్టోరీ చెబుతానంటూ రాసుకొచ్చాడు. అంతేకాదు నయనిక ఫ్రెండ్స్ కు కూడా అల్లు శిరీష్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. మరోవైపు నితిన్ భార్య షాలిని సైతం అల్లు శిరీష్, నయనిక ఎంగేజ్మెంట్ ఫోటోను ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. మీ బ్యూటీఫుల్ స్టోరీలో నేను భాగమయినందుకు సంతోషంగా ఉందని పోస్ట్ చేయగా.. శిరీష్ రిప్లై ఇస్తూ.. థాంక్యూ పెళ్లి పెద్ద అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఇప్పుడు అల్లు శిరీష్ లవ్ స్టోరీ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే అల్లు శిరీష్, నయనికల పెళ్లి తేదీని ప్రకటించనున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss 9: తనూజ గుట్టు రట్టు చేశా…అందుకే కక్ష కట్టి బయటికి పంపేశాడు
భార్య బికినీ వేసుకునేందుకు.. ఏకంగా ఐలాండ్‌నే కొనేసాడు..
ఎండ తగలని జీవితాలు.. ఆ లోపం తో బాధపడుతున్న మెజార్టీ పీపుల్
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..

