Allu Arjun: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌పై అల్లు అర్జున్ ఎమోషనల్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీర్తి కిరీటంలో మరో అవార్డు చేరింది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025లో అల్లు అర్జున్ మోస్ట్ వర్సటైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్బంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘ఇంతటి అద్భుతమైన గౌరవం ఇచ్చిన దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీకి ప్రత్యేక ధన్యవాదాలు.
నాకు చాలా సంతోషంగా ఉంది. ఇతర విభాగాల విజేతలకు నా హృదయపూర్వక అభినందనలు. నిరంతర నాపై ప్రేమాభిమానాలు కురిపిస్తోన్న అభిమానులకు, ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు… ఈ అవార్డును నా అభిమానులకు వినయంగా అంకితం చేస్తున్నాను’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బన్నీకి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ తో ఓ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. ది గార్దియన్ ఆఫ్ ది గెలాక్సీ తరహాలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో హాలీవుడ్ లెవల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనె ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Sirish: నితిన్ భార్య వల్లే.. ప్రేమలో పడ్డా.. లవ్‌స్టోరీ వివరించిన అల్లు వారబ్బాయి
Bigg Boss 9: తనూజ గుట్టు రట్టు చేశా…అందుకే కక్ష కట్టి బయటికి పంపేశాడు
భార్య బికినీ వేసుకునేందుకు.. ఏకంగా ఐలాండ్‌నే కొనేసాడు..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

