Tollywood: 18 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి చేసుకున్న హీరోయిన్..
సినీరంగంలో లవ్, బ్రేకప్, పెళ్లి, విడాకులు కామన్ అయ్యాయి. స్టార్ హీరోహీరోయిన్ తమ వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నారు. మరికొందరి వైవాహిక జీవితం గురించి నిత్యం ఏదోక వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కానీ కొందరు నటీనటులు మాత్రం మరో పెళ్లికి సిద్ధమవుతున్నారు.
సినీ పరిశ్రమలో టాప్ సింగర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన అధ్భుతమైన గాత్రంతో మెప్పించింది. కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎప్పుడూ వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. 18 ఏళ్లకే పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ముగ్గురు పిల్లల తల్లిగా తన ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేసింది. కానీ మొదటి వివాహం ఎక్కువ రోజులు నిలబడలేదు. ఇప్పుడు మరోసారి పెళ్లికి రెడీ అయ్యింది. ఇప్పుడు 43 సంవత్సరాల వయసులో ఓ బిజినెస్ మ్యాన్ తో ఏడడుగులు వేసేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఆ సింగర్ ఎవరో తెలుసా.. తనే కనిక కపూర్..
ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించింది. కెరీర్ తొలినాళ్లలోనే 1988లో 18 సంవత్సరాల వయస్సులో రాజ్ చంద్రలోక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు అయానా, మారా, యువరాజ్ జన్మించారు. కానీ వీరిద్దరు మనస్పర్థలతో 2012లోనే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పిల్లలతో కలిసి ఒంటరిగా గడిపింది కనికా.. ఆ తర్వాత 2022లో వ్యాపారవేత్త గౌతం హథీరమణిని వివాహం చేసుకుంది. దీంతో ఆమెను అప్పుడు విపరీతంగా ట్రోల్స్ జరిగాయి.
2022లో తన రెండో పెళ్లిని లండన్ లో చేసుకుంది. తన మ్యారేజ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన రెండవ భర్తతో దాదాపు 15 ఏళ్లుగా స్నేహం ఉందని.. చాలా కాలం కలిసి గడిపిన తర్వాతే తామిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని గతంలో కనిక ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 2014లో గౌతమ్ తనకు ప్రపోజ్ చేశాడని.. ఆ తర్వాత 2020లో మరోసారి పెళ్లి ప్రపోజ్ చేశాడని.. 2 ఏళ్లకే తాము వివాహం చేసుకున్నామని తెలిపింది.
View this post on Instagram
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.