Tollywood: ఏం ఛేంజ్ గురూ.. ఏడాదిలోనే 35 కిలోలు తగ్గిన హీరోయిన్.. ఈ 4 పనులు చేస్తే చాలంట..
ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అతి తక్కువ సమయంలోనే నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను దొచేసింది. కానీ సినిమా, తన పాత్ర కోసం ఊహించని రిస్క్ చేసింది. సినిమా కోసం ఏకంగా 89 కిలోల బరువు పెరిగింది. కట్ చేస్తే.. ఇప్పుడు ఏడాదిలోనే నాజుగ్గా మారి షాకిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

సాధారణంగా ఫిట్నెస్, లుక్స్ విషయంలో హీరోహీరోయిన్స్ ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొందరు మాత్రం సినిమా, పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అందులో హీరోయిన్ అనుష్క ఒకరు. జీరో సైజ్ సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ కోసం సులభంగా బరువు తగ్గింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరోయిన్ సైతం ఈ జాబితాలోకి వస్తుంది. కేవలం తన సినిమాలోని పాత్ర కోసం ఏకంగా 89 కిలోల బరువు పెరిగింది ఈ అమ్మడు. అప్పట్లో ఆమె డెడికేషన్ పై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కట్ చేస్తే. ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ వెంటనే కేవలం ఏడాదిలోనే 35 కిలోలు బరువు తగ్గి మళ్లీ స్లిమ్ గా మారిపోయింది. ఎలాంటి డైట్ ఫాలో కాకుండా.. ఏమాత్రం ఆకలితో ఉండకుండానే వెయిట్ లాస్ అయ్యింది. ఇప్పుడు ఆమె ఫిట్నెస్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ? తనే బాలీవుడ్ ముద్దుగుమ్మ.. భూమి ఫెడ్నేకర్. హిందీ సినీ పరిశ్రమలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు.
అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్. దమ్ లగా కే హైషా చిత్రంతో అలరించనుంది. అయితే ఈ సినిమా కోసం ఏకంగా 32 కిలోలు తగ్గి అభిమానులను షాక్ కు గురిచేసింది. కేవలం ఒక్క సంవత్సరంలోనే 89 కిలోల నుంచి 57 కిలోలకు వచ్చింది. కఠిన డైట్ ఫాలో కాకుండా.. ఆకలితో ఉండకుండానే దాదాపు 35 కిలోలు తగ్గింది. ఇటీవల ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ తన బరువు తగ్గడానికి గల కారణాలు చెప్పుకొచ్చింది. బరువు తగ్గడానికి ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.. ? ఏ ఆహారాన్ని ఎంత పరిమాణంలో తీసుకోవాలి? అనే విషయాలపై సరైన ప్లాన్ చేసుకోవాలని తెలిపింది. ఇంట్లో చేసిన భోజనాలు ఎక్కువగా తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది.
అలాగే మార్నింగ్ ఎక్కువ క్యాలరీస్ ఉన్న బ్రేక్ ఫాస్ట్ తీసుకోవద్దని.. నానబెట్టిన బాదం, పండ్లు, టోస్ట్ వంటి పదార్థాలు తీసుకున్నట్లు తెలిపింది. ప్రతిరోజూ వ్యాయామం చేశానని.. పైలేట్స్, వెయిట్ ట్రైనింగ్, వాకింగ్, డ్యాన్స్ ఎక్కువగా చేసినట్లు చెప్పుకొచ్చింది. బరువు తగ్గడానికి ఎప్పుడూ తొందరపడలేదని.. ప్రతి కిలో తగ్గే వరకు ఎంతో ఓపిగ్గా, ప్రశాంతంగా వెయిట్ చేసినట్లు తెలిపింది. ప్రతిరోజు బరువు చూసుకోలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో సత్తా చాటుతుంది భూమి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..




