Tollywood: ఫస్ట్ మూవీకి రూ.10 రెమ్యునరేషన్.. ఆ తర్వాత స్టార్ హీరోలతో సినిమాలు.. కట్ చేస్తే..
పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఆమె. ఒకప్పుడు తెలుగు, హిందీ, మలయాళం, తమిళం భాషలలో స్టార్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఆమె క్రేజ్ ఓ రేంజ్ లో ఉండేది. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోస్ సైతం వెయిట్ చేసిన రోజులు ఉన్నాయంటే ఆమె ఫాలోయింగ్ ఎలా ఉండేదో చెప్పక్కర్లేదు.

ఇండస్ట్రీలో చాలా మంది నటులు బాలనటీనటులుగా అరంగేట్రం చేసినవారే. అప్పట్లో స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి మెప్పించి..ఇప్పుడు హీరోహీరోయిన్లుగా సినీరంగాన్ని ఏలుతున్నవారు చాలా మంది ఉన్నారు. ఈ హీరోయిన్ సైతం అలాంటి జాబితాలోకి చెందినదే. ఆమె మొదటి సినిమాకు కేవలం రూ.10 పారితోషికం తీసుకుంది. ఆ తర్వాత భారతీయ సినిమాలో అత్యంత ఖరీదైన హీరోయిన్ గా మారింది. ఆమె మరెవరో కాదండి.. సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్ జయప్రద. అతి చిన్న వయసులోనే నటన ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఏ పాత్ర చేసినా అందులో పూర్తిగా లీనమైపోవడం జయప్రద స్పెషాలిటి. దీంతో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. తెలుగులో దేవత, సాగర సంగమం, సిరి సిరి మువ్వ వంటి అనేక ఎవర్ గ్రీన్ చిత్రాల్లో నటించింది.
ప్రతి సినిమాలో తన నటనతో అడియన్స్ మనసులను గెలుచుకుంది. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. జయప్రద దాదాపు 8 భాషల్లో సినిమాల్లో నటించింది. దాదాపు 300 సినిమాల్లో నటించిన జయప్రద తన మొదటి సినిమాకు ఎంత పారితోషికం తీసుకుందో తెలుసా.. 13 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో భూమి కోసం అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది.
అంతకంటే ముందు ఆమె నటించిన ఓ సినిమాకు రూ.10 పారితోషికం తీసుకుంది. వెండితెరపై, బుల్లితెరపై ఎన్నో పాత్రలు పోషించింది. సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన జయప్రద.. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఆమె రాంపూర్ నుంచి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు, జయప్రద బీజేపీలో చేరి ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..




