AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఖర్చుల కోసం షాపింగ్ మాల్ యాడ్స్ చేసింది.. ఇప్పుడు రూ.100 కోట్ల ఆస్తి.. తెలుగులో క్రేజీ హీరోయిన్..

విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరిక.. అదే విషయాన్ని ఇంట్లో చెప్పగా.. అంత డబ్బు తన వద్ద లేదని తండ్రి చెప్పడంతో తన కలలన్నీ చెదిరిపోయాయి. పాకెట్ మనీ కోసం షాపింగ్ మాల్స్ లో పనిచేసిన ఓ అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Actress: ఖర్చుల కోసం షాపింగ్ మాల్ యాడ్స్ చేసింది.. ఇప్పుడు రూ.100 కోట్ల ఆస్తి.. తెలుగులో క్రేజీ హీరోయిన్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2025 | 5:14 PM

Share

ప్రస్తుతం సినీరంగంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని ఓ సాధారణ అమ్మాయి.. ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. ఒకప్పుడు చదువుకోవడానికి డబ్బులు లేక.. మధ్యలోనే చదువులు ఆపేసింది. కానీ ఇప్పుడు ఆమె రూ.100 కోట్ల ఆస్తికి యజమాని. అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. విమర్శలను ప్రశంసలుగా తీసుకుని తన నటనతో వెండితెరపై మ్యాజిక్ చేసింది. సినీరంగుల ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ హీరోయిన్.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. ప్రేమ, పెళ్లి, అనారోగ్య సమస్యలతో మానసిక సంఘర్షణకు గురైన ఆమె.. చెరగని చిరునవ్వుతో తిరిగి గ్లామర్ ప్రపంచంలో దూసుకుపోతుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? జీవితంలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ఇప్పుడు మెరుగైన స్థానానికి చేరుకున్న తారలలో సమంత ఒకరు.

ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..

ఇవి కూడా చదవండి

సమంత.. ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. 1987 ఏప్రిల్ 28న కేరళలోని అలప్పుజలో జన్మించిన ఆమె.. తండ్రి తమిళనాడుకు చెందినవారు కాగా.. తల్లి కేరళకు చెందినవారు. బాల్యం మొత్తం చెన్నైలోనే గడిపింది. అక్కడే 12వ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలని నిర్ణయించుకుంది. కానీ అప్పటికే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు రావడం.. తన ఉన్నత చదువులకు తండ్రి వద్ద డబ్బులు లేకపోవడంతో స్టడీకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. తన ఖర్చుల కోసం మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. షాపింగ్ మాల్స్ యాడ్స్ చేసింది. మోడలింగ్ ప్రపంచంలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ రవివర్మన్ ఆమె ప్రతిభను గుర్తించి ఆమెకు మాస్కోస్ కావేరి చిత్రంలో అవకాశం అందించారు. ఈ సినిమా కంటే ముందే గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ఏ మాయ చేసావే సినిమా తెలుగులో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది.

ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్‏తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఈ సినిమా తర్వాత తెలుగుతోపాటు తమిళంలో వరుస సినిమా అవకాశాలు అందుకుంది. దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, తేరి, రంగస్థలం, ఓ బేబీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ద్వారా ఓటీటీ అరంగేట్రం చేసిన సామ్.. ఇందులో రాజీ పాత్రతో పాన్ ఇండియా లెవల్లో ప్రశంసలు అందుకుంది. 2017లో నాగచైతన్యను వివాహం చేసుకుంది. కానీ వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యతో బాధపడింది సామ్.

ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..

కొన్నిరోజులుగా సినిమాలకు దూరంగా విశ్రాంతి తీసుకున్న సామ్.. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. అటు సినిమాలు.. ఇటు ఓటీటీల్లో వెబ్ సిరీస్ చేస్తూ అలరిస్తుంది. అలాగే ఇప్పుడిప్పుడే నిర్మాతగానూ వరుస సినిమాలు నిర్మిస్తుంది. అటు సినిమాల్లో బిజీగా ఉంటూనే.. ఇటు వ్యాపార రంగంలోనూ రాణిస్తుంది. నివేదికల ప్రకారం సమంత ఆస్తుల విలువ రూ.101 కోట్లు ఉంటుందని అంచనా.

ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..