
అక్కినేని నాగార్జున నటించిన ఢమరుకం సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో అనుష్క కథానాయికగా నటించింది. ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యాడు గణేశ్ వెంకట్రామన్. ఢమరుకం చిత్రంలో విలన్ గా నటించి తన టెర్రిఫిక్ నటనతో ప్రశంసలు అందుకున్నాడు. హీరో కటౌట్.. హ్యాండ్సమ్ లుక్స్ ఉన్నప్పటికీ విలన్ గా కనిపించిన గణేశ్.. ఈ చిత్రంలో అద్భుతమైన నటనతో కట్టిపడేశాడు. అంతకుముందు తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఎక్కువగా ఢమరుకం సినిమాతో జనాలకు దగ్గరయ్యారు. 2009లో ఈనాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇందులో ఇన్స్పెక్టర్ అరీఫ్ ఖాన్ పాత్రలో నటించారు. గణేశ్ వెంకట్రామన్.. తెలుగుతోపాటు తమిళంలోనూ అనేక సినిమాలు చేశారు.
ఢమరుకం సినిమా తర్వాత అతడికి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాగల 24 గంటల్లో, అంతిమ తీర్పు, శబరి వంటి చిత్రాల్లో నటించారు. సినిమాలతోపాటు తమిళంలో పలు సీరియల్స్ చేశారు. తమిళంలో బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని 3వ రన్న రప్ గా నిలిచాడు. ఇదంతా పక్కన పెడితే.. మీకు తెలుసా.. గణేశ్ వెంకట్రామన్ భార్య సైతం తెలుగులో టాప్ హీరోయిన్. తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది. ఆమె పేరు నిషా కృష్ణన్.
ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
కోలీవుడ్ విశాల్ నటించిన ఇంద్రుడు సినిమాలో హీరోయిన్ గా చేసింది. అలాగే కృష్ణుడికి వారసుడు అనే సినిమాలోనూ నటించింది. తెలుగులో సినిమాలు కాకుండా శ్రీమంతుడు అనే సీరియల్ చేసింది. కానీ ఆమెకు తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం నిషా కృష్ణన్ సినిమాలకు దూరంగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. నిషా కృష్ణన్, గణేశ్ వెంకట్రామన్ దంపతులకు ఒక పాప, బాబు ఉన్నారు.
ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..