AVS: కమెడియన్ ఏవీఎస్ కూతురు, అల్లుడు ఇద్దరూ యాక్టర్స్ అని తెలుసా..? సీరియల్స్‏లో చాలా ఫేమస్..

AVS అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. తెలుగులో అనేక చిత్రాల్లో హాస్యనటుడిగా మెప్పించిన ఏవీఎస్ ... రచయితగా.. నిర్మాతగా, దర్శకుడిగా, పాటల రచయితగా అనేక సినిమాలకు వర్క్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం, ఏవీఎస్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి.

AVS: కమెడియన్ ఏవీఎస్ కూతురు, అల్లుడు ఇద్దరూ యాక్టర్స్ అని తెలుసా..? సీరియల్స్‏లో చాలా ఫేమస్..
Avs
Follow us

|

Updated on: Jun 27, 2024 | 8:31 AM

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న పాపులర్ హాస్యనటులలో దివంగత నటుడు AVS ఒకరు. తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా అవసరం లేని పేరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. AVS అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం. తెలుగులో అనేక చిత్రాల్లో హాస్యనటుడిగా మెప్పించిన ఏవీఎస్ … రచయితగా.. నిర్మాతగా, దర్శకుడిగా, పాటల రచయితగా అనేక సినిమాలకు వర్క్ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బ్రహ్మానందం, ఏవీఎస్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. అయితే చేతినిండా సినిమాలు.. నటుడిగా వెండితెరపై సందడి చేస్తూ ఎంతో సరదాగా కనిపించిన ఏవీఎస్.. 2013లో మరణించారు. ఆయన మరణం తెలుగు సినీ ఇండస్ట్రీలోకి తీరని లోటు. అయితే ఏవీఎస్ కుటుంబం గురించి చాలా తక్కువ మందకి తెలుసు. కానీ ఆయన కూతురు, అల్లుడు కూడా నటీనటులే. ముఖ్యంగా తెలుగు ఫ్యామిలీ అడియన్స్‏కు చాలా సుపరిచితమైనవారే. కానీ వారిద్దరూ కమెడియన్ ఏవీఎస్ కూతురు, అల్లుడు అని అంతగా ఎవరికీ తెలియదు.

ఏవీఎస్ కూతురు శ్రీ ప్రశాంతి ప్రస్తుతం బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సీరియల్స్‏లో కీలకపాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ప్రస్తుతం చాలా సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉంది. అలాగే పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. శ్రీ ప్రశాంతికి సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉంది. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు.. తండ్రితో కలిసి ఉన్న జ్ఞాపకాలను యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తుంటుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రీల్స్ పెడుతుంది.

ఏవీఎస్ కూతురు ప్రశాంతి బుల్లితెర నటుడు శ్రీనివాస్ ను వివాహం చేసుకుంది. శ్రీనివాస్ అలియాస్ యాక్టర్ చింటు తెలుగు, తమిళం భాషలలో అనేక సినిమాలు, సీరియల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా కనిపించారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. తాజాగా శ్రీ ప్రశాంతి షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.