Tollywood : 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్.. 18 ఏళ్లకే పెళ్లి.. 21 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు.. ఇప్పటికీ వీడని మిస్టరీ..

ఒకప్పుడు దక్షిణాదిలో ఆమె స్టార్ హీరోయిన్. 15 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒక్క ఏడాదిలోనే తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. కానీ 21 ఏళ్ల వయసులోనే అర్ధాంతరంగా మరణించింది. ఇప్పటికీ ఆమె మరణం వీడని మిస్టరీ. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

Tollywood : 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్.. 18 ఏళ్లకే పెళ్లి.. 21 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు.. ఇప్పటికీ వీడని మిస్టరీ..
Divya Bharthi

Edited By:

Updated on: Feb 20, 2025 | 6:00 PM

దివ్య భారతి… ఈ పేరు దక్షిణాది సినీప్రియులు ఎప్పటికీ మర్చిపోలేరు. చూడచక్కని రూపం.. అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి తమ అమాయకమైన చూపులతో అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మూడేళ్లకే ఆమె రంగుల ప్రపంచాన్ని వదిలేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 1993 ఏప్రిల్ 5న అనుహ్యంగా మరణించింది. కానీ అప్పటికే ఆమె బాలీవుడ్ ప్రొడ్యుసర్ సాజిద్ నదియాద్వాలాను వివాహం చేసుకుంది. 1974లో జన్మించిన దివ్య భారతి.. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే 14 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

నిర్మాత నందు తులానీ ఆమెను సినీరంగంలోకి పరిచయం చేయాలనుకున్నారు. కానీ వీరిద్దరి కాంబోలో రావాల్సిన సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత 1990లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు దివ్య వయసు 16 సంవత్సరాలు మాత్రమే. 1992లో హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. కేవలం మూడేళ్లలో ఏకంగా 21 చిత్రాల్లో నటించింది. ఇంకా ఆమె చేతిలో దాదాపు 30 సినిమాలకు పైగా ఉన్నాయట. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

దివ్య రెండవ చిత్రం ‘షోలా ఔర్ షబ్నం’. ఈ చిత్రంలో గోవింద నటించారు. సాజిద్ అప్పుడే స్వతంత్రంగా సినిమాలు నిర్మించడం ప్రారంభించాడు. ఆ సమయంలో, సాజిద్ ‘షోలా ఔర్ షబ్నం’ సెట్‌లను సందర్శిస్తున్నాడు. ఆ సమయంలో దివ్యతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరు రహస్యంగా 1992లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది దివ్య భారతి అనుహ్యంగా బిల్డింగ్ పై నుంచి కిందపడి చనిపోయింది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన