AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR : ముంబైలో దేవర ప్రమోషన్స్.. ఎన్టీఆర్ చేతికున్న లగ్జరీ వాచ్ ధర ఎంతో తెలుసా..?

రెండు భాగాలుగా రూపొందించిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా పై మరింత హైప్ పెంచేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు తారక్.

Jr NTR : ముంబైలో దేవర ప్రమోషన్స్.. ఎన్టీఆర్ చేతికున్న లగ్జరీ వాచ్ ధర ఎంతో తెలుసా..?
Jrntr
Rajitha Chanti
|

Updated on: Sep 12, 2024 | 1:56 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ట్రిపుల్ ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న తారక్.. ఇప్పుడు దాదాపు ఆరేళ్ల తర్వాత సోలోగా అడియన్స్ ముందుకు రాబోతున్నారు. 2018లో అరవింద సమేత మూవీ తర్వాత ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా దేవర. దీంతో ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందించిన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా పై మరింత హైప్ పెంచేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు తారక్.

కొన్ని రోజులుగా ముంబైలో దేవర ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. హీరోయిన్ అలియా భట్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో కలిసి తారక్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ఎంతో స్టైలీష్ గా కనిపించారు. ముఖ్యంగా తారక్ ధరించిన Audemars Piguet (AP) Royal Oak Concept Split Chronograph GMT లార్జ్ డేట్ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫ్యాన్సీ వాచ్ ధర గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫ్యాన్సీ వాచ్ ధరెంతో తెలుసా.. అక్షరాల రూ.21 కోట్లు అని తెలుస్తోంది. నిజానికి తారక్ కు లగ్జరీ వాచీలు, అత్యాధునిక ఫ్యాషన్స్ పట్ల ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇదివరకు చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ వాచ్ కలెక్షన్స్ గురించి అభిమానులు వరుస పోస్టులు చేశారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. దేవర ఫస్ట్ పార్టులో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనుండగా.. రెండవ భాగంలో బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇటు దేవర సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. అటు వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయనున్నారు. ఇందులో హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us