Jr. NTR Cars: జూనియర్ ఎన్టీఆర్ కార్ల కలెక్షన్స్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో హిట్ లను సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలో, పాన్ ఇండియాలో తనకంటూ ఓ మార్కును క్రియేట్ చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో కొద్దిగా నిరాశ చెందాడు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తన సత్తాను చాటుకున్నారు.. ఆ రోజు మొదలైన విజయాలు ఈనాటికీ కొనసాగుతున్నాయి..
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు శ్రీ నందమూరి తారకరామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అటు అభిమానులు ఇటు కుటుంబ సభ్యులు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఇప్పటికే దేవరా మూవీ నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.. తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో హిట్ లను సొంతం చేసుకుంటూ ఇండస్ట్రీలో, పాన్ ఇండియాలో తనకంటూ ఓ మార్కును క్రియేట్ చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్.. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్. ఆ సినిమా ఫ్లాప్ అవడంతో కొద్దిగా నిరాశ చెందాడు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో తన సత్తాను చాటుకున్నారు.. ఆ రోజు మొదలైన విజయాలు ఈనాటికీ కొనసాగుతున్నాయి. ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా ఎదగడంతోపాటు కలెక్షన్ లోను భారీ రికార్డులను సొంతం చేసుకున్నారు.. మధ్యలో ఎన్ని ఆటుపోట్లు వచ్చిన వెనక్కి తగ్గకుండా ఒంటరి పోరాటం చేస్తూ నిలబడ్డారు.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి హీరో గా తెలుగోడు గర్వించేలా గుర్తింపు పొందారు తారక్. అలాంటి మన జూనియర్ ఎన్టీఆర్ కు సినిమా మీద ఎంత ప్రేమ ఉందో అలానే తన లగ్జరీ కార్ల మీద కూడా అంతే ఎక్కువగా ప్రేమ ఉంది..ఇంతకీ ఆ కార్లు ఏంటి.? వాటి ధరలు ఎంత. ? అన్నది చూద్దాం.!
ఏదైనా సినిమాలు చేస్తే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు బద్దలు కొడతారు తారక్ అలానే ఏవైనా కార్లు కొనాలి అన్న అంతే స్థాయిలో భారీ ఖర్చు చేస్తారు తారక్. జూనియర్ ఎన్టీఆర్ కు సినిమాలంటే ఎంత ఇష్టమో కార్లు కూడా అంతే ఇష్టము ఇటీవల రెండు భారీ ధర పలికే కార్లను కొనుగోలు చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే లంబోర్ఘిని ఉరస్ అలాగే రేంజ్ రోవర్ లను కలిగి ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ మే బ్యాక్ ఎస్ క్లాస్ అలాగే హుందాయి ఎలక్ట్రిక్ 5 బ్లాక్ ను తన గరాజ్ లో చేర్చాడు.
జూనియర్ ఎన్టీఆర్‌కు లగ్జరీ కార్ల పట్ల ఉన్న ప్రేమ ఎంతో ఈ కారు విలువ చూస్తేనే అర్థమవుతుంది. ఇటీవల కాలంలో కొన్న మెర్సిడెస్ బెంజ్ బ్యాక్ ఎస్ క్లాస్ తనకు ఇష్టమైన నలుపు రంగులో కష్టమైజ్ చేయించుకున్నారు.. దీని విలువ 4.23 కోట్లు రూపాయలు. ఇక హుందాయి ఎలక్ట్రిక్ ఐకానిక్ 5 బ్లాక్ ధర 55.2 లక్షలతో ఉంది.. ప్రస్తుతం ఈ రెండు కార్లే సుమారు ఐదు కోట్ల రూపాయల వరకు చేరింది. అంతేకాదు 2021 లో దేశంలోనే లంబోర్గిని ఉరస్ గ్రాఫైట్ ను తన ఇంటికి తెచ్చుకున్నాడు తారక్.. అటు సినిమాల్లోనూ ఇటు లగ్జరీ కార్లు కొనుగోలు విషయంలోనూ తన మార్క్ ను క్రియేట్ చేసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇకపోతే ఎలా రానున్న రోజుల్లో ఎలాంటి లగ్జరీకార్లు కొనబోతున్నారు చూడాలి. ఇక టాలీవుడ్ ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్న దేవరా సినిమా కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.