Sreeleela: ‘గుంటూరు కారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిసిన శ్రీలీల.. బ్యూటీ గడుల చీర ధర తెలిస్తే షాకే..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఈనెల 12న విడుదల కానుంది. ఇందులో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం గుంటూరులో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా విచ్చేయగా.. ఈవెంట్లో మహేష్ ఎమోషనల్ అయ్యాడు.

ప్రస్తుతం సంక్రాంతి రేసులో ఉన్న చిత్రాల్లో గుంటూరు కారం ఒకటి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఈనెల 12న విడుదల కానుంది. ఇందులో మీనాక్షి చౌదరీ, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం గుంటూరులో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా విచ్చేయగా.. ఈవెంట్లో మహేష్ ఎమోషనల్ అయ్యాడు. తన సినిమాలకు ఎప్పుడూ రివ్యూ చెప్పే తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరని.. ఇకపై ప్రేక్షకులు, అభిమానులే తనకు అమ్మ నాన్న అంటూ భావోద్వేగానికి గురయ్యాడు మహేష్. అంతకు ముందు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పై తన మాటలతో ఆకట్టుకుంది హీరోయిన్ శ్రీలీల.
బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో మహేష్ అలా ఉన్నారని చెప్పుకొచ్చింది. ఇక ఈసారి గుంటూరు కారం ఈవెంట్ కు ట్రెండీ శారీలో మరింత స్టైలీష్ లుక్లో మెరిసిపోయింది శ్రీలీల. బాటిల్ కలర్ గడుల చీరలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. శ్రీలీల కట్టుకున్న చీర కాస్త డిఫరెంట్ గా కనిపించడంతో ఇప్పుడు ఆ శారీ ధర.. వివరాల గురించి నెట్టింట సెర్చింగ్ స్టార్ట్ చేశారు నెటిజన్స్. ఇక ఆ శారీ ధర తెలిసి నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ శ్రీలీల శారీ ధర ఎంతో తెలుసా.. అక్షరాల రూ.1.59.000.

Sreeleela Saree Cost
అనును.. చూడటానికి ఎంతో సింపుల్గా ఉన్న ఈ చీర ధర రూ. 1.59.000 అని తెలిసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. బాటిల్ గ్రీన్ కట్ వర్క్ శారీ అనే పేరుతో ఈ చీర.. Sawan Gandhi అనే ఆన్ లైన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఎప్పుడూ ఎంతో సింపుల్ గా కనిపించే శ్రీలీల.. ఇప్పుడు మహేష్ సినిమా వేడుక కోసం ఈరేంజ్ చీరలో రావడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
View this post on Instagram
“Oka bangaaru vigrahaniki pranam posinattu untaru @urstrulyMahesh” says @sreeleela14 about our very own SUPERSTAR ❤️
Watch live : https://t.co/rhqa8XDyeo
Super🌟@urstrulyMahesh #GunturKaaram #GunturKaaramOnJan12th 🌶️
— Guntur Kaaram (@GunturKaaram) January 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.