Game Changer: ‘గేమ్ ఛేంజర్’ సెట్లో బ్రహ్మానందం.. రామ్ చరణ్‌కు స్పెషల్ గిఫ్ట్.. చెర్రీ న్యూలుక్ చూశారా ?..
ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. అలాగే ఇదివరకు ఎన్నడూ కనిపించని రేంజ్లో పొలిటికల్ లీడర్ పాత్రలోనూ కనిపించనున్నాడు చరణ్. దీంతో ఈ మూవీ కోసం వరల్డ్ వైడ్ మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలలుగా శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇక ఇదే షెడ్యూల్ లో హాస్యబ్రహ్మా బ్రహ్మానందం కూడా జాయిన్ అయ్యాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో శ్రీకాంత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే మెగా అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. అలాగే ఇదివరకు ఎన్నడూ కనిపించని రేంజ్లో పొలిటికల్ లీడర్ పాత్రలోనూ కనిపించనున్నాడు చరణ్. దీంతో ఈ మూవీ కోసం వరల్డ్ వైడ్ మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలలుగా శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇక ఇదే షెడ్యూల్ లో హాస్యబ్రహ్మా బ్రహ్మానందం కూడా జాయిన్ అయ్యాడు. ఇండియన్ 2లోనూ బ్రహ్మానందం నటించినట్లుగా తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ సినిమాలో ఓ స్పెషల్ అప్పియరెన్స్ పాత్ర ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తుంది. ఈ పాత్రలో బ్రహ్మానందం కనిపించనున్నారని.. ఇందుకు ఆయన రెండు రోజులు డేట్లు కేటాయించినట్లుగా సమాచారం. మంగళవారం బ్రహ్మానందం సెట్ లో అడుగుపెట్టారని.. అప్పుడే ఆయనకు సంబంధించిన షూట్ కూడా జరిగిందని తెలుస్తోంది. ఇక తన పాత్ర షూటింగ్ అనంతరం చెర్రీకి ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు బ్రహ్మీ. ఇటీవల తను రాసిన ఆత్మకత ‘నేను’ అనే పుస్తకాన్ని చెర్రీకి బహుమతిగా అందించాడు. ఈ పుస్తకం గురించి చరణ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ పుస్తకంలో ఎన్నో జీవిత సత్యాలు, జీవితానికి సరిపడా పాఠాలు, నవ్వులు అన్ని ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చరణ్ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
Journeying through the incredible life of #Brahmanandam Garu in ‘NENU,’ his autobiography crafted with humor and heart. 📘 These pages hold the essence of laughter, life lessons, and the cinematic charm he brought to us all.
Order the book through this link:… pic.twitter.com/kY7qgaFtrS
— Ram Charan (@AlwaysRamCharan) January 10, 2024
అయితే ఈ ఫోటోలలో చరణ్ లుక్ సరికొత్తగా కనిపిస్తుంది. ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న ఫోటోలలో చరణ్ ఐఏఎస్ అధికారిలా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో చరమ్ కాలేజీ కుర్రాడిలా, 80’s, 90’s ల నేపథ్యంలో రాజకీయ నాయకుడిలా, ఐఏఎస్ అధికారిలా కనిపించనున్నట్లు ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.