Saindhav: ‘సైంధవ్’ పై అంచనాలు పెంచేసిన డైరెక్టర్.. చివరి ఆ 20 నిమిషాలు మాత్రం..
హిట్ యూనివర్స్‌తో మంచి విజయం అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను దర్శకత్వం వహిస్తుండగా.. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రుహాణి శర్మ కీలకపాత్రలలో నటించగా.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్రయూనిట్ సైంధవ్ ప్రమోషన్లలో బిజీగా ఉంది.

చాలా కాలం తర్వాత ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు వెంకీమామ. హిట్ యూనివర్స్‌తో మంచి విజయం అందుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను దర్శకత్వం వహిస్తుండగా.. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించాడు. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, రుహాణి శర్మ కీలకపాత్రలలో నటించగా.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్రయూనిట్ సైంధవ్ ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో సైంధవ్ సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెబుతూ మరిన్ని అంచనాలు పెంచేశారు డైరెక్టర్ శైలేష్ కొలను.
“ఇప్పుడే చివరి కాపీలను పంపిణీ చేశాం. సైంధవ్ సినిమా ఇప్పుడు మీదే. నేను మీతో మరో విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. సైంధవ్ సినిమాలోని చివరి 20 నిమిషాలు మాత్రం చాలా అనుభవాన్ని ఇస్తుంది. అలాగే ఇదంతా కేవలం వెంకటేష్ వల్లే సాధ్యమైంది. ఆయన అపూర్వమైన నటుడు.. ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆయనను డైరెక్ట్ చేయడం అసలు ఊహించలేదు. అందుకు జీవితంలో అర్హుడినా అని ఆలోచిస్తున్నాను. జనవరి 13న నేను ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది.” అంటూ ట్వీ్ట్ చేశారు. దీంతో ఇప్పుడు సైంధవ్ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
Just delivered the final domestic copies. Saindhav is yours now. I just wanted to share something with you and I am saying this with utmost humility and politeness. The last 20 minutes of #Saindhav will remain as one of the best pieces of cinematic experiences anyone could have…
— Sailesh Kolanu (@KolanuSailesh) January 10, 2024
సైంధవ్ సినిమా ఎమోషనల్ డెప్త్ ఉన్న మూవీ అని.. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి కుమార్తె గాయత్రిని తన తండ్రి సైంధవ్ (వెంకటేష్) ఎలా కాపాడుకుంటాడు ?.. గాయత్రికి కావాల్సిన రూ.17 కోట్ల ఖరీదైన ఇంజక్షన్ కోసం ఏ విధంగా పోరాటం చేస్తాడు ? అనేది ఈ సినిమా అని అన్నారు డైరెక్టర్ శైలేష్ కొలను.
Release tension ochinappudalla I just sing Bujjikondave to calm down. I am confident you all will like the film. See you in the theatres on Jan 13th. @VenkyMama @Nawazuddin_S @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @arya_offl @NiharikaEnt @maniDop @Garrybh88… pic.twitter.com/hlssDokCvz
— Sailesh Kolanu (@KolanuSailesh) January 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.