
సినీరంగుల ప్రపంచంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో కష్టాలు, సవాళ్లను ఎదుర్కొని .. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన నటనతో ప్రేక్షకులను ఆక్టటుకుంది. వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే కెరీర్ స్టార్ట్ చేసింది.. ఒకప్పుడు ఆమె యాక్టింగ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. కానీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటున్న సమయంలోనే వరుసగా ప్లాప్స్ రావడం.. దీంతో అవకాశాలు తగ్గిపోవడంతో మానసిక ఒత్తిడికి గురైంది. ఒకప్పుడు వెండితెరపై అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె జీవితం మాత్రం విషాదంగ ముగిసింది. ఆమె పేరు అశ్విని. ఈతరం ప్రేక్షకులకు అంతగా తెలియదు. కానీ 90వ దశకం సినీప్రియులు మాత్రం ఆమెను మర్చిపోలేరు. అంతగా సహజ నటనతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది.
అశ్విని… ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్. 90వ దశకంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగులోని స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసిన ఆమె.. ఎక్కువగా తమిళంలోనే నటించింది. నెల్లూరు జిల్లాలో పుట్టిన ఈ అచ్చతెలుగమ్మాయి.. బాలనటిగా తెరంగేట్రం చేసింది. దాదాపు 100కు పైగాసినిమాల్లో నటించి మెప్పించింది. చివరకు అనాథలా మరణించింది. ఆమె చనిపోయిన తర్వాత మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు మరో నటుడు సాయం చేయాల్సి వచ్చిందంటే.. ఆమె పరిస్థితి ఎంత దారుణంగా మారిందో చెప్పక్కర్లేదు.
సీనియర్ నటి భానుమతి తెరకెక్కించిన భక్త ధృవ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది అశ్విని. ఆ తర్వాత ఇంటర్ చదువుతున్న సమయంలోనే కథానాయికగా అవకాశాలు అందుకుంది. అనాదిగా ఆడది, భలే తమ్ముడు, అరణ్య కాండ, కలియుగ పాండవులు, చూపులు కలిసిన శుభవేశ, పెళ్లి చేసి చూడు, కొడుకు దిద్దిన కాపురం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. రచయిత పువియరుసు మనవడిని రహస్యంగా వివాహం చేసుకుంది. కానీ పెళ్లి తర్వాత జీవితం సరిగ్గా లేకపోవడం.. అవకాశాలు తగ్గిపోవడంతో మానసిక ఒత్తిడికి గురైంది. దీంతో ఆమె ఆరోగ్యంపై ప్రభావం చూపించింది. కొన్నాళ్లు అనారోగ్య సమస్యలతో బాధపడిన అశ్విని 2012 సెప్టెంబర్ 23న మరణించింది. ఆమె పార్థివదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు డబ్బులు లేకపోవడంతో తమిళ్ హీరో పార్తీబన్ సాయం అందించారట.
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..