Shreya Ghoshal: సింగర్ శ్రేయా ఘోషల్ భర్త ఎవరో తెలుసా..? అతడి పూర్తి బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..
కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి అంతగా తెలియదు. తన పర్సనల్ లైఫ్ గురించి శ్రేయా ఘోషల్ ఎక్కడా మాట్లాడదు. కానీ ఇప్పుడు ఆమె భర్తకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. సినీ సంగీత ప్రపంచంలో శ్రేయా ఘోషల్ అగ్రస్థానంలో ఉండగా.. ఐటీ రంగంలో ఆమె భర్త శిలాధిత్యకు మంచి పేరు ఉంది.
శ్రేయా ఘోషల్.. సంగీత ప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అద్భుతమైన గాత్రంతో శ్రోతల హృదయాలను మైమరపిస్తుంది. సంతోషం, దుఃఖం, ప్రేమ, ఫెయిల్యూర్ ఇలా ఏ భావనైనా తన గాత్రంతో తెలియజేస్తుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, మలయాళం ఇలా ఎన్నో భాషలలో అనేక పాటలు ఆలపించింది. చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి కోట్లాది మంది మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. శ్రేయా ఘోషల్ పాటల గురించి మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి అంతగా తెలియదు. తన పర్సనల్ లైఫ్ గురించి శ్రేయా ఘోషల్ ఎక్కడా మాట్లాడదు. కానీ ఇప్పుడు ఆమె భర్తకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. సినీ సంగీత ప్రపంచంలో శ్రేయా ఘోషల్ అగ్రస్థానంలో ఉండగా.. ఐటీ రంగంలో ఆమె భర్త శిలాధిత్యకు మంచి పేరు ఉంది.
ప్రముఖ కాలర్ ఐడీ, స్పామ్ బ్లాకింగ్ యాప్ ట్రూకాలర్ లో శ్రేయ భర్త శిలాదిత్య ముఖోపాధ్యాయ కీలక బాధ్యతలో ఉన్నారు. ఏప్రిల్ 2022 నుండి ట్రూకాలర్‌కు గ్లోబల్ హెడ్‌గా, శిలాదిత్య వర్క్ చేస్తున్నారు. ఇందులో శిలాదిత్య ముఖోపాధ్యాయ వ్యాపార అభివృద్ధి, మొబైల్ అప్లికేషన్స్, సాఫ్ట్ వేర్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో ఎన్నో మార్పులు తీసుకువచ్చారు. అంతకు ముందు కాలిఫోర్నియాలో ఉన్న ప్రముఖ సాస్ కంపెనీ క్లీవర్ టాప్ లో ఉన్నత పదవిలో నిర్వహించాడు. అతడు ముంబై యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు.
శ్రేయా ఘోషల్, శిలాదిత్య ముఖోపాధ్యాయ చిన్ననాటి స్నేహితులు. తొమ్మిదేళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2015లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021లో బాబు దేవయాన్ జన్మించారు. శ్రేయా ఘోషల్ ఇప్పటివరకు 5సార్లు జాతీయ చలనచిత్ర అవార్డ్ అందుకున్నారు. అలాగే సినీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకునే సింగర్స్ లో శ్రేయా ఒకరు. ప్రస్తుతం ఆమె సంపాదన రూ.185 కోట్లు ఉంటుందని సమాచారం.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.