తెల్లారి ఆర్డర్ కోసం వచ్చి బిత్తరపోయిన రూమ్‌బాయ్.. ఎదురుగా కనిపించిన దృశ్యం చూడగా
హోటల్ గది తెరిచిన రూమ్ బాయ్ ఒక్కసారిగా కేకలు వేశాడు. ఏం జరిగిందని పరుగున వచ్చిన హోటల్ చూసేసరికి 5 మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. తల్లితోపాటు నలుగురు చెల్లెలను అత్యంత దారుణంగా హతమార్చిన ఓ యువకుడు.. డెడ్‌బాడీల పక్కనే కూర్చుని కనిపించాడు.
ఉత్తరప్రదేశ్‌లో కొత్త సంవత్సరం వేళ తీవ్ర విషాద ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. లక్నోలో రక్తపాత సంఘటన జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఓ హోటల్‌లో ఐదు మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన మహిళలు. ఈ హత్య చేసింది మరెవరో కాదు, అతని స్వంత కుటుంబ సభ్యులేనని పోలీసు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
డిసెంబర్ 30న ఓ కుటుంబం లక్నో శరంజిత్ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుంది. సోమవారం(డిసెంబర్ 30) ఉదయం హోటల్ సిబ్బంది గదిలో చెల్లాచెదురుగా పడి ఉన్న ఐదు మృతదేహాలను చూసి షాక్ అయ్యారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో నిందితుడు కూడా గదిలోనే ఉన్నాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులు హత్యకు సంబంధించిన మొత్తం కథను వివరించాడు. నిందితుడి పేరు అర్షద్. మృతుల్లో అర్షద్ తల్లి అస్మా తోపాటు నలుగురు సోదరీమణులు ఆలియా (9 సంవత్సరాలు), అల్షియా (19), రహ్మీన్ (18), అక్సా (16) ఉన్నారు. కాగా, అర్షద్ తండ్రి ప్రస్తుతం ఘటనా స్థలం నుంచి పరారీలో ఉన్నాడు. ఈ హత్యలో అతడి ప్రమేయం కూడా ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అర్షద్ తండ్రి ఆచూకీ కోసం పోలీసు బృందం ముమ్మరంగా గాలిస్తోంది.
జాయింట్ సీపీ బబ్లూ కుమార్ మాట్లాడుతూ- అర్షద్ ఈ నేరాన్ని అంగీకరించాడు. అందరి చేతులు, మెడపై పదునైన ఆయుధాలతో దాడి చేసిన గుర్తులు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. నిందితుడు అర్షద్ తండ్రి కోసం కూడా గాలిస్తున్నారు. ఈ హత్యలో అతని పాత్ర కూడా ఉండే అవకాశం ఉందన్నారు పోలీసులు. అర్షద్ తండ్రిని అరెస్ట్ చేస్తే ఈ విషయం నిర్ధారణ అవుతుందన్నారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలం నుంచి అన్ని ఆధారాలను సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఈ ఘటన ఠాణాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హోటల్ శరంజీత్‌లో అర్షద్ అనే యువకుడు తన తల్లి, నలుగురు సోదరీమణులను హత్య చేశాడు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని చెబుతున్నారు. నిందితుడు అర్షద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే హత్యకు కారణమని నిందితులు తెలిపారు. దీనిపై పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు. శరంజిత్ హోటల్ గదిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని డిసిపి రవీనా త్యాగి తెలిపారు. స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆగ్రాకు చెందిన అర్షద్ అనే 24 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా తన నలుగురు అక్కాచెల్లెళ్లు, తల్లిని హత్య చేశానని చెప్పాడు. హోటల్ సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. తదుపరి విచారణ జరుగుతోందన్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..