Mrunal Thakur: తస్సాదియ్యా.. అందంలో చెల్లిని మించిపోయిన అక్క.. మృణాల్ సోదరిని చూశారా..?

బుల్లితెరపై నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసిన ఓ సాధారణ అమ్మాయి.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. తెలుగు, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. కొన్నాళ్లుగా హిందీపై ఫోకస్ పెట్టింది. తను మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.

Mrunal Thakur: తస్సాదియ్యా.. అందంలో చెల్లిని మించిపోయిన అక్క.. మృణాల్ సోదరిని చూశారా..?
Mrunal Thakur

Updated on: Mar 04, 2025 | 1:08 PM

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మరాఠీ బుల్లితెరపైకి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత నెమ్మదిగా కథానాయికగా మారింది. హిందీలో హీరోయిన్ ఆఫర్స్ అందుకుంటూ అద్భుతమైన నటనతో మెప్పించింది. అయితే మృణాల్ కు ఎక్కువగా క్రేజ్ వచ్చింది మాత్రం తెలుగు సినిమాతోనే. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఇందులో సీతామహాలక్ష్మీ పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది. తెలుగుతోపాటు అటు హిందీలోనూ మరిన్ని ఆఫర్స్ అందుకుంది. అయితే మృణాల్ ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి అంతగా మాట్లాడదు.

ప్రస్తుతం సినీరంగంలో మృణాల్ అందంగా కనిపించడానికి ఆమె అక్క ప్రధాన కారణం. ఆమె పేరు లోచన్ ఠాకూర్. మేకప్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.. ఇప్పుడు సినీరంగంలో మేకప్ ఆర్టిస్ట్, హెయిల్ స్టైలిస్ట్ గా కొనసాగుతుంది. మృణాల్ నటించిన అన్ని సినిమాలకు మృణాల్ మేకప్ ఆర్టిస్ట్ గా వర్త్ చేసింది. సీతారామం, హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలకు సైతం లోచన్ పనిచేసింది. తెలుగు ప్రేక్షకులు, హిందీ అడియన్స్ అభిరుచిలకు తగినట్లుగా మృణాల్ ను రెడీ చేసింది. అలాగే సినీరంగంలో పలువురు స్టార్లకు సైతం లోచన్ వర్క్ చేసింది.

ఇవి కూడా చదవండి

లోచన్ ఠాకూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం తన చెల్లెలి ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది. ప్రస్తుతం లోచన్ ఠాకూర్ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. లోచన్ ఠాకూర్ సైతం ఎంతో అందంగా ఉందని.. హీరోయిన్ గా ట్రై చేయొచ్చంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..