Rules Ranjan: ‘రూల్స్ రంజన్’ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్.. అనుకున్న దానికంటే ముందే స్ట్రీమింగ్ ?..
ఇక ఇటీవలే రూల్స్ రంజన్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. అక్టోబర్ 6న విడుదలైన ఈ సినిమా మిక్డ్స్ టాక్ అందుకుంది. ఇందులో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించింది. పాటలు, ట్రైలర్ తో ఆసక్తిని రెకెత్తించిన ఈ మూవీపై విడుదలకు ముందే మంచి హైప్ నెలకొంది. కానీ రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ చిత్రానికి రత్నం కృష్ణా దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే .. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ అయ్యింది.

హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న హీరో కిరణ్ అబ్బవరం. ఎస్.ఆర్ కళ్యాణ మండపం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత అంతటి స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయారు. ఇక ఇటీవలే రూల్స్ రంజన్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చాడు. అక్టోబర్ 6న విడుదలైన ఈ సినిమా మిక్డ్స్ టాక్ అందుకుంది. ఇందులో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటించింది. పాటలు, ట్రైలర్ తో ఆసక్తిని రెకెత్తించిన ఈ మూవీపై విడుదలకు ముందే మంచి హైప్ నెలకొంది. కానీ రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ చిత్రానికి రత్నం కృష్ణా దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే .. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ అయ్యింది.
ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మంచి రేటుకే ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందని.. నవంబర్ తొలి వారంలో రూల్స్ రంజన్ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారట. సాధారణంగా ప్రతి సినిమా విడుదలైన నెలన్నర తర్వాత డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి రానుంది. ముందుగా ఈ సినిమాను నవంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు.. కానీ ఇప్పుడు నెట్టింట వినిపిస్తోన్న టాక్ ప్రకారం అక్టోబర్ మూడో వారంలోనే ఈ చిత్రాన్ని ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
View this post on Instagram
కానీ ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి నటనకు ప్రశంసలు వస్తున్నాయి. ఈ చిత్రంలో మెహర్ చాహల్, వెన్నెల కిశోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్ కీలకపాత్రలు పోషించగా.. అమ్రీశ్ సంగీతం అందించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




