AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kichcha Sudeep: ‘ఇప్పుడు మా అమ్మ అందమైన జ్ఞాపకం మాత్రమే’.. తల్లిని తల్చుకుంటూ సుదీప్ ఎమోషనల్  

'బిగ్ బాస్ షూట్‌కి వెళ్లే ముందు నన్ను గట్టిగా కౌగిలించుకున్న మా అమ్మ ఆ తర్వాత కొన్ని గంటలకే ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. ఆమెకు నివాళులు అర్పించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సందేశాలు, ట్వీట్ల ద్వారా నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని కిచ్చా సుదీప్ ట్వీట్ చేశారు.

Kichcha Sudeep: 'ఇప్పుడు మా అమ్మ అందమైన జ్ఞాపకం మాత్రమే'.. తల్లిని తల్చుకుంటూ సుదీప్ ఎమోషనల్  
Kichcha Sudeep
Basha Shek
|

Updated on: Dec 02, 2024 | 7:43 PM

Share

కిచ్చా సుదీప్ తల్లి సరోజా సంజీవ్ ఆదివారం ( అక్టోబర్ 20న) కన్నుమూశారు. ఆమె మరణం తో సుదీప్‌కు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ముఖ్యంగా అంత్యక్రియల సమయంలో తల్లి భౌతిక కాయాన్ని పట్టుకుని బోరున ఏడ్చేశాడీ స్టార్ హీరో. ఆ సమయంలో అతనిని ఓదార్చాడం ఎవరి వల్లా కాలేదు. కాగా తన తల్లిని తల్చుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు సుదీప్. అందులో ఆదివారం ఏం జరిగిందో చెబుతూ బాగా ఎమోషనలయ్యాడీ స్టార్ హీరో. ‘మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ. ఆమె నా జీవితాన్ని ఎంతో అందంగా మార్చింది. ఆమె నాకు దేవతతో సమానం. ఆమె నా గురువు, నా నిజమైన శ్రేయోభిలాషి, నా మొదటి అభిమాని. కానీ ఇప్పుడు మా అమ్మ అందమైన జ్ఞాపకం మాత్రమే’. ‘ప్రస్తుతం నేను పడుతున్న ఆవేదనను వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు. జరిగిన దాని గురించి నేను వ్రాయలేను. 24 గంటల్లో అంతా మారిపోయింది’ అని సుదీప్ ఎమోషనల్ అయ్యాడు.

‘ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకు నా ఫోన్‌లో గుడ్‌మార్నింగ్‌ కందా అంటూ మెసేజ్‌ వచ్చేది. అమ్మ నాకు చివరిసారిగా అక్టోబర్ 18 శుక్రవారం నాడు సందేశం పంపింది. నేను బిగ్ బాస్‌లో ఉన్నందున ఆ మెసేజ్ ను చూడలేకపోయాను. ఆ తర్వాత నేను మా అమ్మకు మార్నింగ్ టెక్స్ట్ పంపాను. అంతా ఓకే అని చెప్పడానికి ఆమెకు కాల్ చేయాలనుకున్నాను. కానీ, బిగ్‌బాస్‌లోని శనివారం నాటి ఎపిసోడ్‌ షూట్ లో పాల్గొనాల్సి ఉంది. నేను వేదికపైకి వెళ్ళే ముందు, అతను ఆసుపత్రిలో చేరినట్లు నాకు కాల్ వచ్చింది. వెంటనే ఆసుపత్రిలో ఉన్న అక్కకు ఫోన్ చేసి డాక్టర్ తో మాట్లాడి స్టేజీపైకి వెళ్లాను’ అని సుదీప్ జరిగిన సంఘటనను వివరించాడు.

ఇవి కూడా చదవండి

‘నేను బిగ్‌బాస్ వేదికపై ఉన్నప్పుడు, అమ్మ పరిస్థితి విషమంగా ఉందని నాకు సందేశం వచ్చింది. నేను మొదటిసారిగా నిస్సహాయతకు లోనయ్యాను. అప్పుడు నేను శనివారం ఎపిసోడ్‌ని హోస్ట్ చేస్తున్నాను. ఎన్ని కష్టాలున్నా ఒప్పుకున్న పనిని మనం చేసి తీరాలని అమ్మ చెప్పేది. ఇది నాకు నేర్పినందుకు నేను మా అమ్మకు రుణపడి ఉంటాను. శనివారం ఎపిసోడ్‌ షూటింగ్‌ ముగించుకుని వెంటనే హాస్పిటల్‌కి వెళ్లాను. మా అమ్మను వెంటిలేటర్‌పై ఉంచారు. మా అమ్మ అపస్మారక స్థితిలో ఉంది. నేను ఆమెను చూడలేకపోయాను. ఆ తర్వాత కొన్ని నిమిషాలకే ఆమె ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. కొన్ని గంటల్లోనే అంతా మారిపోయింది. అమ్మ, బాగా విశ్రాంతి తీసుకో. ఐ లవ్ యూ అండ్ మిస్ యూ’ అంటూ అమ్మపై తనకున్న ప్రేమకు అక్షర రూపం ఇచ్చాడు సుదీప్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సుదీప్ కు ధైర్యం చెబుతున్నారు.

కిచ్చా సుదీప్ ఎమోషనల్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.