Content Movies: మంచి కంటెంట్ సినిమాలపై పెద్ద బ్యానర్లు ఫోకస్.. భారీగా చిన్న సినిమాల సంఖ్య..
ఓ వైపు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్‌ను రూల్ చేస్తుంటే.. మరో వైపు మంచి కంటెంట్‌తో వస్తున్న చిన్న సినిమాలు కూడా ఘన విజయాలు సాధిస్తున్నాయి. అందుకే ఇప్పుడు బడా బ్యానర్లు కూడా అలాంటి సినిమాల మీదే దృష్టి పెడుతున్నాయి. దీంతో పెద్ద బ్యానర్లలో వస్తున్న చిన్న సినిమాల సంఖ్య భారీగా కనిపిస్తోంది.