Vijay Deverakonda: విజయ్ దేవరకొండ క్రేజ్ వల్ల లైగర్‌ని దాటేసిన ఖుషి మూవీ..

తన యాటిట్యూడ్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు విజయ్.

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ క్రేజ్ వల్ల లైగర్‌ని దాటేసిన ఖుషి మూవీ..
Vijay Devarakonda
Follow us

|

Updated on: Nov 09, 2022 | 4:08 PM

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా ఎదిగారు విజయ్. తన యాటిట్యూడ్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు విజయ్. ఇక ఇటీవలే లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు విజయ్. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే..

లైగర్ ఇటీవల విడుదలై అంచనాలని చేరుకోలేదన్న విషయం కూడా తెలిసిందే. కానీ ఆ చిత్రం ఊహించని స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. తాజాగా లైగర్ తో కోల్పోయిన బిజినెస్ ని తనకున్న క్రేజ్ తో మళ్ళీ సెట్ చేస్తున్నారు విజయ్. భారీ అంచనాల మధ్య వస్తున్న తన కొత్త చిత్రం ఖుషి ప్రీ-రిలీజ్ బిజినెస్ తో ఇప్పటికే లైగర్ రికార్డ్స్ ని దాటేసాడు ఈ రౌడీ స్టార్. లైగర్ 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. ఖుషి 90 కోట్ల పైగా ప్రీ బిజినెస్ సాధించింది. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. సమ్మర్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

చూస్తుంటే లైగర్ ప్రభావం విజయ్ మార్కెట్ పై ఏమాత్రం ఉన్నట్టుగా లేదు. దానికి కారణం అతనికి జనాల్లో ఉన్న క్రేజ్ అలాగే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మార్చగల సత్తా. ఇది మాత్రమే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ ఎండార్స్మెంట్ డీల్స్ అతనికి కోకొల్లలు గా రావడం చూస్తుంటే రాబోయే కాలంలో అతను ఏ స్థాయికి వెళ్ళగలడో అర్ధమవుతుంది.

ఇవి కూడా చదవండి
Latest Articles