AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఓరి దేవుడా.. కేరింత మూవీలో నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

2015లో వచ్చిన కేరింత మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో భావన క్యారెక్టర్‌లో చేసిన అమ్మాయి ఎవరో గుర్తుందా… తన పేరు సుకృతి అంబటి. తను ఇప్పుడు ఎలా ఉంది..? ఏం చేస్తుందో తెలుసుకుందాం పదండి....

Tollywood: ఓరి దేవుడా.. కేరింత మూవీలో నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?
Sukrithi Ambati
Ram Naramaneni
|

Updated on: Sep 26, 2024 | 12:21 PM

Share

కంటెంట్ ఉంటే చాలు భాషా బేధాలు లేకుండా లేకుండా సినిమాలను ఆదరిస్తారు తెలుగు జనాలు. చిన్న హీరో, లో బడ్జెట్ సినిమా అని ఏం ఉండదు. మాకు కావాల్సింది మంచి సినిమా చూసిన అనుభూతి అని చెబుతుంటారు. అలానే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కొన్ని చిన్న సినిమాలు సంచలన విజయం సాధించాయి. ముఖ్యంగా యూత్‌ టార్గెట్‌గా వచ్చే సినిమాలకు ఎక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. అలాంటి సినిమాలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫోకస్ ఎప్పుడూ ఉంటుంది. ఆయన పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ కూడా.. మరోవైపు కథలు నచ్చితే చిన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేస్తుంటారు. ఇటీవల వచ్చిన బలగం ఆ కోవకు చెందిన సినిమానే. అలానే గతంలో సాయి కిరణ్ అడవి డైరెక్షన్‌లో కేరింత సినిమా తీయగా.. అది మంచి హిట్ అయింది. ఈ మూవీలో సుమంత్ అశ్విన్, పార్వతీశం, విశ్వంత్ దుడ్డుంపూడి, సుకృతి అంబటి, తేజస్వి మదివాడ, శ్రీదివ్య  కీ రోల్స్ పోషించారు.

యువతీ యువకుల మధ్య ప్రెండ్షిప్, ప్రేమ వంటి ఎమోషన్స్‌ను మిళితం చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. మూవీకి మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ మరో ప్లస్ పాయింంట్. దర్శకుడు సాయి కిరణ్‌కు కూడా మంచి నేమ్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో నటించిన చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే ఈ సినిమాలో పార్వతీశంకు జోడీగా నటించిన ఆర్టిస్ట్ గుర్తుందా.? తన పేరు సుకృతి అంబటి.

కేరింత మూవీ తర్వాత తన పెద్దగా సినిమాల్లో కనిపించలేదు. పెళ్లి చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తోంది. కేరింత మూవీలో భావన అనే పాత్రలో చక్కగా నటించి మెప్పించింది ఈ సందరాంగి. కాగా చిన్నతనంలోనే మదర్ చనిపోవడంతో తండ్రి పెంపకంలోనే పెరిగిన సుకృతి.. ఢిల్లీలోని కులచి హన్స్ రాజ్ పాఠశాలలో చదివింది. రాజస్థాన్‌లోని బనస్థలి యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసింది. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ ఈ అమ్మడు. తన లేటెస్ట్ లుక్ ఉందో మీరూ చూసెయ్యండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
Video: క్షణాల్లో బరువు తగ్గించే పవర్ ఫుల్ 'సీక్రెట్ టిప్' ఇదిగో
Video: క్షణాల్లో బరువు తగ్గించే పవర్ ఫుల్ 'సీక్రెట్ టిప్' ఇదిగో
ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.
ఉదయాన్నే పరగడుపున మామిడి పండ్లు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలు
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బిగ్ బాస్ 10లోకి క్రేజీ బ్యూటీ..
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
బంగారం లాంటి వార్త.. మరింత తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్!
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
శుక్రుడి మహా ప్రభావం.. ఈ 4 రాశుల వారికి డబ్బు, పదోన్నతి, అదృష్టం
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
మంగళవారం.. ఈ ఒక్క పరిహారం చేస్తే హనుమంతుడి అనుగ్రహం, కుజ దోషాలు..
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
జూన్ 9 రాశిఫలాలు:వారికి ఆర్థిక లాభాలు, అన్ని ప్రయత్నాల్లో సక్సెస్
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఉదయాన్నే కీళ్లు బిగుసుకుపోతున్నాయా? ఆర్థరైటిస్ సహా ఈ ప్రమాదకర..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..
ఎండిన తులసిని పారేయొద్దు.. ఇలా చేస్తే ఇంటికి శుభం, ఐశ్వర్యం ..