Keerthy Suresh: విమర్శలు చేస్తే తీసుకుంటాను.. కానీ ఆ మాటలను అస్సలు పట్టించుకోను.. కీర్తి సురేష్..
ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా వరుసగా ఈవెంట్లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి సురేష్ అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే అభిమానుల ప్రశ్నలకు సమాధానలిచ్చారు.
నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్.. మహానటి మూవీతో నేషనల్ అవార్డ్ అందుకుంది. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో నటించిన కీర్తి… ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. హిందీలో సినిమాలు చేస్తూ అక్కడే బిజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో నటించిన రఘు తాత చిత్రం. డైరెక్టర్ సుమన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ హోంబలే ఫిల్స్మ్ బ్యానర్ పై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా వరుసగా ఈవెంట్లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న కీర్తి సురేష్ అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే అభిమానుల ప్రశ్నలకు సమాధానలిచ్చారు.
ఈ క్రమంలో తన పెళ్లిపై వస్తున్న వార్తలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు కీర్తి సురేష్. “నాపై వచ్చే రూమర్స్ పై ప్రతిసారి క్లారిటీ ఇస్తుంటే అదే నిజమనుకుంటారు. అందుకే వాటిపై నేను రియాక్ట్ కాను. కేవలం నా సినిమాల ఎంపిక.. నటనపై విమర్శలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తాను.. వాటితో కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడతాను… నా వ్యక్తిగత జీవితం.. ఫ్యామిలీ గురించి ఎవరైనా కామెంట్స్ చేసినా అస్సలు పట్టించుకోను.. వాళ్ల వ్యక్తిగత కారణాలతో చేసే కామెంట్స్ సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు.” అంటూ చెప్పుకొచ్చింది.
కీర్తి పెళ్లి గురించి రూమర్స్ రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు కీర్తి పెళ్లి గురించి అనేక వార్తలు వినిపించాయి. వాటన్నింటినిపై ఆమె తల్లిదండ్రులు రియాక్ట్ అయ్యారు. తమ పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ నిజం కాదని ఖండించారు. ఇక ఇప్పుడు నేరుగా కీర్తి సురేష్ తన వివాహం గురించి స్పందించింది. ప్రస్తుతం కీర్తి నటించిన రఘు తాత చిత్రంలో పోరాటం చేసే మహిళ పాత్రలో కనిపించనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.