
సెలబ్రిటీల జీవితం పూర్తిగా విలాసవంతమైనది. వాళ్ళు వేసుకునే బట్టల ధర, వాచ్, షూస్ ధర తెలిసి జనాలు ఆశ్చర్యపోతుంటారు. ముఖ్యంగా స్టార్స్ డ్రెస్సింగ్, లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. తమ ఫ్యాషన్ కోసం స్టార్స్ లక్షలు ఖర్చు చేస్తారు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ధరించిన దుస్తులు, వాచ్ కలెక్షన్ వివరాలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా కీర్తి సురేష్ డ్రెస్ ధర తెలిసి ఖంగుతిన్నారు నెటిజన్స్. అవును.. ఇటీవల తన భర్తతో కలిసి ఇచ్చిన పార్టీలో కీర్తి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఆమె డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. నివేదికల ప్రకారం కీర్తి ధరించిన ఆ డ్రెస్ ధర దాదాపు రూ.2.45 లక్షలు అని తెలుస్తోంది.
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధర చూసి నెటిజన్లు షాకవుతున్నారు. కీర్తి సురేష్ కు మంచి డిమాండ్ ఉంది. తన స్కూల్ స్నేహితుడు ఆంటోనితో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ఇటీవలే వెల్లడించింది. గతేడాది గోవాలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. ఇక ఇప్పుడు తన పెళ్లి తర్వాత పార్టీ సైతం అక్కడే జరిగినట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ ధరించిన గౌను అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ మెరిసే గౌనును రోహిత్ గాంధీ , రాహుల్ ఖన్నా రూపొందించారు.
కీర్తి సురేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవలే బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది కీర్తి సురేష్. నివేదికల ప్రకారం కీర్తి సురేష్ ఆస్తులు రూ.41 కోట్లు ఉన్నట్లు సమాచారం. ఆమె భర్త ఆంటోనీ టాటిల్ ఒక వ్యాపారవేత్త. అతడి ఆస్తులు దాదాపు రూ.150 కోట్ల వరకు ఉంటాయని చెబుతున్నారు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..