AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paiyaa Movie: 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవుతున్న సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడంటే..

ఇటీవలే దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమాను విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత మరోసారి ఉదయ్ ను బిగ్ స్క్రీన్ పై చూసి ఎమోషనల్ అయ్యారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో సూపర్ హిట్ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. అదే పైయ్యా ఒకటి. కోలీవుడ్ హీరో కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటించిన ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహించారు. 2010లో విడుదలైన ఈసినిమా భారీ విజయాన్ని అందుకుంది.

Paiyaa Movie: 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్ అవుతున్న సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడంటే..
Paiyaa Movie
Rajitha Chanti
|

Updated on: Apr 04, 2024 | 3:48 PM

Share

కొన్నిరోజుల క్రితం రీరిలీజ్ ట్రెండ్ తెగ నడిచింది. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలను మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. అలాగే అప్పట్లో పర్వాలేదనిపించుకున్న సినిమాలను సైతం మళ్లీ రిలీజ్ చేయగా.. మంచి వసూళ్లు రాబట్టాయి. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, సిద్ధార్థ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోస్ సినిమాలన్నింటిని ఒక్కొక్కటిగా రిలీజ్ చేశారు. ఇటీవలే దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమాను విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత మరోసారి ఉదయ్ ను బిగ్ స్క్రీన్ పై చూసి ఎమోషనల్ అయ్యారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో సూపర్ హిట్ చిత్రాన్ని రీరిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. అదే పైయ్యా ఒకటి. కోలీవుడ్ హీరో కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటించిన ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహించారు. 2010లో విడుదలైన ఈసినిమా భారీ విజయాన్ని అందుకుంది.

తిరుపతి బ్రదర్స్ ఫిలిం మీడియా బ్యానర్ పై సుభాష్ చంద్రబోస్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఆవారా పేరుతో రిలీజ్ చేశారు. అలాగే ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ శ్రోతలను మెస్మరైజ్ చేసింది. రోడ్ ట్రావెల్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రాగా.. అటు ఇందులోని సాంగ్స్ అని సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోట వినిపిస్తుంటాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాను రీరిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్.

ఆవారా చిత్రాన్ని ఇప్పుడు 4కే వెర్షన్ తో ఏప్రిల్ 11న తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయనున్నారట. అలాగే ఈ సినిమాకు సీక్వెల్ తీసుకువస్తానని గతంలో డైరెక్టర్ లింగుస్వామి తెలిపారు. ఈ మూవీలో లవ్, యాక్షన్, చేజింగ్స్, కామెడీ అన్ని అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే కార్తీ, తమన్నా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాకు సీక్వెల్ పై త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
దేశంలోనే నెం.1.. విద్యుత్ వినియోగంలో తెలంగాణ సరికొత్త రికార్డ్..
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి
స్టవ్ లేకుండా ఎంతో రుచిగా చిటికెలో చేసుకునే పొలం పచ్చడి