Kantara- Sita Ramam: ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్‌లో మన సినిమాలు..
కన్నడ ఇండస్ట్రీలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి బిగెస్ట్ హిట్ గా నిలిచింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు.
చిన్న సినిమాలుగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటి లిస్ట్ లో కాంతారా, సీతారామం సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. వీటిలో ముందుగా కాంతార సినిమా గురించి చెప్పుకోవాలి. కన్నడ ఇండస్ట్రీలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి బిగెస్ట్ హిట్ గా నిలిచింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు. ముందుగా కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న తర్వాత ఇతరభాషల్లో రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అలాగే మరో సినిమా సీతారామం. ఈ సినిమాను హన్ను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కింది.
ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించగా.. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అందమైన ప్రేమ కథతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
ఇక ఈ రెండు సినిమాలు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ 14వ ఎడిషన్ లో నామినేట్ అయ్యాయి. 1 జూన్ 2022 నుండి 31 మే 2023 రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ ల్లో 14వ ఎడిషన్ కోసం నామినేషన్లను ప్రకటించింది. వీటిలో ఉత్తమ నటుడు – ఉత్తమ నటి విభాగాల లో అగ్రగామిగా నిలిచిన చిత్రాల జాబితా తాజాగా వెల్లడైంది. డార్లింగ్స్ – మోనికా ఓ మై డార్లింగ్ – పొన్నియిన్ సెల్వన్ – కాంతారా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి.