Bhagavanth Kesari: రంగంలోకి దిగిన నటసింహం.. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ అదరగొడుతోన్న బాలయ్య

బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో నటించి మెప్పించారు. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి అనే సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య.

Bhagavanth Kesari: రంగంలోకి దిగిన నటసింహం.. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ అదరగొడుతోన్న బాలయ్య
Bhagavath Kesari
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 15, 2023 | 1:00 PM

కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ బాలకృష్ణ వరస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే రెండు సూపర్ హిట్స్ అందుకున్నారు బాలయ్య. వీటిలో అఖండ అనే సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో నటించి మెప్పించారు. అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి అనే సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య. ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినిమా పై అంచనాలను కూడా పెంచేశారు. ఇప్పుడు ఈ మూవీలో ఓ భారీ యాక్షన్ సీన్ ను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీన్ లో బాలకృష్ణతో పాటు ఇతరతరగణం కూడా పాల్గొంటున్నారని తెలుస్తోంది.

స్టంట్ మాస్టర్ వెంకట్ డైరెక్షన్ లో ఈ యాక్షన్ సీన్స్ తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీన్ పది రోజుల పాటు తెరకెక్కించనున్నారట. ఇప్పటికే ఈ షెడ్యూల్ మొదలు పెట్టారట. ఈ యాక్షన్ సీన్ తర్వాత అదిరిపోయే సాంగ్ ను తెరకెక్కించనున్నారట. ఇక ఈ మూవీ అనిల్ రావిపూడి స్టైల్ లో కామెడి తో పాటు బాలయ్య ఫ్యాన్స్ ను ఆకట్టుకునే యాక్షన్ సీన్స్ కూడా ఉండనున్నాయట..