Alia Bhatt: అలియా భట్ మంచి మనసు.. అమ్మడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్..

స్టూడెంట్ ఆఫ్ డి ఇయర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. స్టార్ హీరో రణబీర్ కపూర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Alia Bhatt: అలియా భట్ మంచి మనసు.. అమ్మడు చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్..
Alia Bhatt
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 15, 2023 | 11:10 AM

అందాల భామ అలియా భట్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ అమ్మడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. స్టూడెంట్ ఆఫ్ డి ఇయర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. స్టార్ హీరో రణబీర్ కపూర్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఈ జంటకు ఓ పాప కూడా పుట్టింది. ఇక పెళ్లిపై పాప పుట్టిన తర్వాత కూడా అలియా భట్ సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు రణవీర్ సింగ్ తో కలిసి సినిమా చేస్తోంది. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక అలియా భట్ కు మంచి ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా అలియా చేసిన పని ఇప్పుడు నెటిజన్స్ ను ఫిదా చేసింది. అలియా మంచి మనసుకు నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా అలియాభట్ తన ఫ్యామిలీతో కలిసి సరదాగా బయటకు వెళ్ళింది.

అయితే బయటకు వచ్చిన అలియాను ఫోటోలు తీసేందుకు కెమెరామెన్ ఎగబడ్డారు. ఈ క్రమంలో ఆన్ కెమెరామెన్ చెప్పు జరిగిపోయింది. దాంతో అది గమనించిన అలియా భట్ ఆ చెప్పును చేత్తో పట్టుకొని.. ఎవరిదో చెప్పు జారిపోయింది..? మీదేనా .? అంటూ ప్రశ్నించింది. చేత్తో తీసి సదరు జర్నలిస్టుకు అందించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలియా భట్ సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు.