AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sapthami Gowda: పెళ్లైన హీరోతో ఆ యవ్వారం.. కోర్టు మెట్లెక్కిన కాంతార బ్యూటీ..

సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. అలాగే ఈ సినిమాలో తన అందంతోనూ కవ్వించింది. కాంతార సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన  బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ పెరిగాయి. కన్నడ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

Sapthami Gowda: పెళ్లైన హీరోతో ఆ యవ్వారం.. కోర్టు మెట్లెక్కిన కాంతార బ్యూటీ..
Sapthami Gowda
Rajeev Rayala
|

Updated on: Jun 16, 2024 | 7:26 AM

Share

కాంతార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ సప్తమీ గౌడ. కన్నడ భాషలో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ కాంతారా సినిమాతో ఫెమస్ అయ్యింది. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. అలాగే ఈ సినిమాలో తన అందంతోనూ కవ్వించింది. కాంతార సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన  బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ పెరిగాయి. కన్నడ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరో భార్య పై ఆమె కేసు వేసింది. ఓ హీరో భార్య తన పై తప్పుడు ప్రచారం చేస్తుందని సప్తమి కోర్టులో కేసు వేశారు ఇంతకూ అసలు ఏం జరిగిందంటే..

కన్నడ ఇండస్ట్రీలోనూ విడాకులు హవా నడుస్తుంది. చాలా మంది స్టార్ కపుల్ ఏ మధ్యకాలంలో విడాకులు తీసుకున్నారు. అలాగే శివరాజు కుమార్ ఫ్యామిలీకి చెందిన యువరాజ్ కుమార్ కూడా తన భార్య నుంచి విడాకులు కోరాడు. తన భార్య తనను వేధిస్తోందని తనకు విడాకులు ఇప్పించాలని కోరాడు. యువరాజ్ , అలాగే ఆయన భార్య శ్రీదేవి ఒకరిపై ఒకరు ఆరోపిస్తూ.. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో యువరాజ్ భార్య శ్రీదేవి మీడియా ముందు షాకింగ్ విషయాలు చెప్పింది.

తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని బాంబ్ పేల్చింది. అలాగే హీరోయిన్ సప్తమీ గౌడను ఈ కేసులోకి లాగింది ఆమె.. సప్తమి గౌడ, యువరాజ్ ప్రేమలో ఉన్నారని ఆరోపించింది. శ్రీదేవి భైరప్ప అమెరికా వెళ్లినప్పుడు యువ, సప్తమి కలిసి జీవించారని ఆమె ఆరోపించింది. సప్తమి గౌడ కోసం నన్ను ఇంటి నుంచి గెంటేసే ప్రయత్నం జరుగుతోందని శ్రీదేవి తన లాయర్ ద్వారా ఆరోపించింది. దీని పై సప్తమి సీరియస్ అయ్యింది. సప్తమి గౌడ శ్రీదేవి భైరప్పపై కోర్టులో కేసు వేశారు శ్రీదేవి భైరప్ప తన పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా నిషేధం విధించాలని కోర్టును కోరింది. శ్రీదేవి తనపై నెగిటివ్ స్టేట్ మెంట్ ఇచ్చిందని, తప్పుడు ఆరోపణలు చేసిందని సప్తమి ఆరోపించింది. శ్రీదేవి భైరప్ప పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసినందుకు ఆమెపై నిషేధం విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దాంతో  శ్రీదేవి భైరప్పకు నోటీసులు జారీ చేయాలని బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..