AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Movie: ‘హనుమాన్’ సినిమాపై కాంతార హీరో ప్రశంసలు.. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా గురించి ఏమన్నారంటే..

భారతదేశంలో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ నుంచి యూఎస్ఏలో రికార్డ్స్ సెట్టింగ్స్ నంబర్స్ వరకు సత్తా చాటుతుంది ఈ చిత్రం. ఇందులో యంగ్ హీరో తేజా సజ్జా, అమృతా అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు రూ. 100 కోట్ల క్లబ్‏లోకి చేరింది. ఇక నాలుగు రోజుల్లోనే వందకోట్ల మైలురాయిని దాటిన ఈ సినిమా.. అటు అమెరికాలో 3 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. అక్కడ మొదటి వారంతంలో ఆర్ఆర్ఆర్, బాహుబలి, సలార్ రికార్డ్స్ బ్రేక్ చేసింది హనుమాన్.

Hanuman Movie: 'హనుమాన్' సినిమాపై కాంతార హీరో ప్రశంసలు.. ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా గురించి ఏమన్నారంటే..
Rishab Shetty, Hanuman
Rajitha Chanti
|

Updated on: Jan 17, 2024 | 12:10 PM

Share

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోన్న సినిమా ‘హనుమాన్’. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. విడుదలకు ముందు ప్రీమియర్స్ షోలతో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకున్న ఈ చిత్రం .. ఇప్పుడు రోజు రోజుకీ మరిన్ని వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది. భారతదేశంలో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ నుంచి యూఎస్ఏలో రికార్డ్స్ సెట్టింగ్స్ నంబర్స్ వరకు సత్తా చాటుతుంది ఈ చిత్రం. ఇందులో యంగ్ హీరో తేజా సజ్జా, అమృతా అయ్యార్, వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషించారు. జనవరి 12న విడుదలైన ఈ సినిమా ఇప్పుడు రూ. 100 కోట్ల క్లబ్‏లోకి చేరింది. ఇక నాలుగు రోజుల్లోనే వందకోట్ల మైలురాయిని దాటిన ఈ సినిమా.. అటు అమెరికాలో 3 మిలియన్ డాలర్లు వసూళు చేసింది. అక్కడ మొదటి వారంతంలో ఆర్ఆర్ఆర్, బాహుబలి, సలార్ రికార్డ్స్ బ్రేక్ చేసింది హనుమాన్.

ఇప్పటికే ఈ సినిమా వీక్షించిన సినీ ప్రముఖులు చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మేకింగ్.. తేజా సజ్జా యాక్టింగ్ అద్భుతమంటూ కొనియాడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ, చిరంజీవి, గోపిచంద్, రవితేజ సహా పలువురు స్టార్స్ ఈ సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తాజాగా కన్నడ స్టార్ హీరో.. కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి సైతం హనుమాన్ సినిమాను వీక్షించాడు. అనంతరం తన ట్విట్టర్ ఖాతాలో హనుమాన్ సినిమాపై ట్వీట్ చేశారు.

“హనుమాన్ సినిమాపై ప్రశంసలు కురిపించే జాబితాలో చేరడం సంతోషంగా ఉంది. ప్రశాంత్ వర్మ కథ చెప్పిన విధానం ఈ సినిమా విజయానికి కారణం. అలాగే తేజా సజ్జా నటన చాలా కాలం పాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్