Salaar Movie: సలార్ సినిమా పై కాంతార హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే

దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు. సలార్ బాక్సాఫీస్ మూడు రోజుల కలెక్షన్స్ 200 కోట్ల రూపాయలకు పైగా వసూల్ చేసింది. నాలుగో రోజు కూడా ఈ సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. ప్రభాస్, శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు స్టార్ ఆర్టిస్టులు ‘సాలార్’ సినిమాలో నటించారు.

Salaar Movie: సలార్ సినిమా పై కాంతార హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే
Salaar Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 25, 2023 | 11:44 AM

భారీ అంచనాల మధ్య విడుదలైన సలార్ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఊహించిన విధంగానే ఈ చిత్రానికి ఆదరణ లభిస్తోంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించుకున్నాడు. సలార్ బాక్సాఫీస్ మూడు రోజుల కలెక్షన్స్ 200 కోట్ల రూపాయలకు పైగా వసూల్ చేసింది. నాలుగో రోజు కూడా ఈ సినిమా చాలా చోట్ల హౌస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. ప్రభాస్, శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు స్టార్ ఆర్టిస్టులు ‘సాలార్’ సినిమాలో నటించారు. ‘హోంబాలే ఫిల్మ్స్’ పతాకంపై విజయ్ కిర్గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ‘సలార్’ సినిమా అన్ని చోట్లా మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

సలార్ సినిమా పై ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రెటీస్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సలార్ సినిమాను మొదటి రోజు అభిమానులతో కలిసి చూసి ఆ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ముఖ్యంగా ప్రభాస్ కటౌట్ కు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రభాస్ కు సరైన సినిమా ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కాంతార హీరో రిషబ్ శెట్టి సలార్ సినిమా పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశాడు .

రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. సలార్ సినిమా పై ప్రశంసలు కురిపించారు రిషబ్ శెట్టి. సలార్ అద్భుతమైన మాస్ సినిమా అని అన్నారు. అలాగే ఈ సినిమా ప్రభాస్ నటన చాలా బాగుందని అన్నారు.  అలాగే వరద రాజమన్నార్ పాత్రలో నటించిన పృథ్వీరాజ్ కు ప్రత్యేక ప్రశంసలు అని అన్నారు. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో అందమైన కథను ప్రశాంత్ నీల్ తెరకెక్కించారని రిషబ్ శెట్టి కొనియాడారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతారా 2 సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు.

సలార్ ట్విట్టర్ పోస్ట్…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి