Kantara: న్యాయ పోరాటంలో గెలిచిన వరాహరూపం సాంగ్.. రిషబ్ శెట్టి రియాక్షన్ ఇదే..
తాజాగా ఈ పాట ఒరిజినల్ అందుబాటులోకి వచ్చేసింది. వరాహ రూపం సాంగ్ న్యాయ పోరాటంలో కాంతార చిత్రం విజయం సాధించింది. ఈ విజయం పై హీరో రిషబ్ శెట్టి స్పందించారు.
బాక్సాఫీస్ సెన్సెషన్ కాంతార ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిన వరాహ రూపం సాంగ్ పై వివాదం రావడంతో.. ఈ చిత్రం నుంచి ఈ పాటను తొలగించారు. ఈ పాటను కాపీ చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తడంతో కేరళ కోర్టు ఈ సాంగ్ ప్రసారం చేయవద్దని ఆదే శాలు జారీ చేసింది. అనుమతులు లేకుండా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వరాహ రూపం సాంగ్ ఉపయోగించవద్దని ఆదేశించింది. దీంతో హోంబలే ఫిల్మ్స్ యూట్యూబ్ ఛానెల్, సావన్ లాంటి మ్యూజిక్ యాప్స్ నుంచి తొలగించింది. అంతేకాకుండా ఇటీవల ఓటీటీలో విడుదలైన కాంతార సినిమాలో వరాహరూపం పాట ట్యూన్‌ను మార్చి యాడ్ చేశారు. అయితే ఈ ట్యూన్ ప్రేక్షకులకు నచ్చకపోవడంతో నెట్టింట భిన్నభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక తాజాగా ఈ పాట ఒరిజినల్ అందుబాటులోకి వచ్చేసింది. వరాహ రూపం సాంగ్ న్యాయ పోరాటంలో కాంతార చిత్రం విజయం సాధించింది. ఈ విజయం పై హీరో రిషబ్ శెట్టి స్పందించారు.
” దేవుళ్ల ఆశీర్వాదం.. ప్రజల ప్రేమతో మేము వరాహ రూపం కేసు గెలిచాము. ప్రజల విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుని అతి త్వరలోనే ఓటీటీ ప్లాట్ ఫాంలో ఈ పాటను మార్చబోతున్నాం” అంటూ ట్వీట్ చేశారు. రిషబ్ శెట్టి ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.
అయితే మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ పాటను పాడిన సింగర్ ఎవరా అంటూ నెట్టంట ఆరా తీయడం మొదలు పెట్టారు నెటిజన్స్. ఈ సాంగ్ పాడింది సింగర్ శ్రీలత. తెలుగు బుల్లితెరపై ఎన్నో సింగింగ్ కాంపిటేషన్స్ లలో తన ప్రతిభను చాటింది సింగర్ శ్రీలలిత. బోల్ బేబీ బోల్, సూపర్ సింగర్, పాడుతా తీయగా, స్వరాభిషేకం, స్వరనీరాజనం, సరిగమప లిటిల్ ఛాంప్స్ లాంటి ప్రోగ్రామ్స్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.
ದೈವಾನು ದೈವಗಳ ಆಶೀರ್ವಾದ ಹಾಗು ಜನರ ಅಭಿಮಾನದಿಂದ ವರಾಹರೂಪಂ ಕೇಸ್ ಗೆದ್ದಿದ್ದೇವೆ. ಜನರ ಕೋರಿಕೆಯನ್ನು ಪರಿಗಣಿಸಿ ಅತಿ ಶೀಘ್ರದಲ್ಲಿ OTT platform ನಲ್ಲಿ ಹಾಡನ್ನು ಬದಲಾಯಿಸಲಿದ್ದೇವೆ . @VKiragandur@ChaluveG @AJANEESHB @Karthik1423 @hombalefilms @KantaraFilmhttps://t.co/STsNEyKmuT
— Rishab Shetty (@shetty_rishab) December 3, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.