Sudeep- Jani Master: జానీ మాస్టర్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన కిచ్చా సుదీప్‌.. ధర ఎంతో తెలుసా?

జానీ మాస్టర్.. టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు డ్యాన్స్‌ మూమెంట్లు అందిస్తూ ప్రశంసలు అందుకుంటోన్న ఈ డ్యాన్స్‌ మాస్టర్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు

Sudeep- Jani Master: జానీ మాస్టర్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన కిచ్చా సుదీప్‌.. ధర ఎంతో తెలుసా?
Jani Master

Updated on: Mar 27, 2022 | 9:03 PM

జానీ మాస్టర్.. టాలీవుడ్‌లో స్టార్ హీరోలకు డ్యాన్స్‌ మూమెంట్లు అందిస్తూ ప్రశంసలు అందుకుంటోన్న ఈ డ్యాన్స్‌ మాస్టర్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు శాండల్‌వుడ్, కోలీవుడ్‌ అగ్రహీరోలకు సైతం తన సూపర్బ్‌ స్టెప్పులు నేర్పిస్తున్నాడు ఈ సూపర్ డ్యాన్సర్ . కాగా  కిచ్చా సుదీప్ (Sudeep) హీరోగా నటించిన ‘విక్రాంత్ రోణా’ చిత్రంలో ఓ పాటకు జానీ మాస్టర్ (Jani Master) డ్యాన్స్ కొరియోగ్రఫీ అందించారు. ఇందులో సుదీప్‌తో పాటు బాలీవుడ్ బూటీ జాక్వెలిన్ పెర్నాండేజ్ కూడా అదిరే స్టెప్పులు వేయనుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కాగా తాజాగా జానీ మాస్టర్‌కు ఖరీదైన మహీంద్ర థార్ కారుని బహుమతిగా ఇచ్చారు సుదీప్‌. దీని విలువ సుమారు రూ.15 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా సుదీప్‌తో జానీ మాస్టర్ కొత్త కారు ముందు నిలుచొని ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

కాగా తమిళంలో విజయ్ హీరోగా నటిస్తోన్న బీస్ట్ సినిమాకు కూడా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఆయన కొరియోగ్రఫీ చేసిన అరబిక్‌ కుత్తు, జాలీ ఓ జింఖానా పాటలు యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతున్నాయి. ఇక మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, క్రేజీ డైరెక్టర్ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఓ సినిమాకు కూడా జానీ మాస్టరే కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి, సునీల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ పట్టాలెక్కనుంది.

Also Read:Viral Video: అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. ఈ యువతి పరిస్థితి చూస్తే మీరూ జాలిపడాల్సిందే!

Sainik Schools: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన..

Telangana: మరదలిపై కన్నేసిన అక్క భర్త.. పెళ్లి వేళ ట్విస్ట్ ఇచ్చాడు.. మరి ఆ యువతి ఏం చేసిందంటే..!