Darshan : జైలు నుంచి రిలీజైన దర్శన్‌కు బిగ్ షాక్ ? వదిలేది లేదంటున్న పోలీస్‌!

దర్శన్ కు బెయిల్ మంజూరైన తర్వాత అక్టోబరు 30 సాయంత్రం సీనియర్ పోలీసు అధికారులు దర్యాప్తు బృందంతో కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.

Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 02, 2024 | 11:55 AM

రేణుకా స్వామి హత్యకేసులో అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చిన హీరో దర్శన్ కు పోలీసులు భారీ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. దర్శన్ కు బెయిల్ మంజూరైన తర్వాత అక్టోబరు 30 సాయంత్రం సీనియర్ పోలీసు అధికారులు దర్యాప్తు బృందంతో కీలక సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దర్శన్‌కు త్వరలో గట్టి షాక్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా దర్శన్ బెయిల్ కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ పోలీసులు సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేయనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోవాలని పోలీసులు నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు నవంబర్ 4 న మరో సారి పోలీస్‌ బాసులు చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు టాక్. ఒక వేళ పోలీసులు.. హైకోర్టు ఆదేశాలపై అప్పీలు చేస్తే దర్శన్‌కు ఎదురుదెబ్బ తగలవచ్చని నిపుణులు చెబుతున్నారు.