కాంతారా.. ప్రస్తుతం సోషల్ మీడియాతో పాటు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. రిషబ్‌శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైంది. మొదటి ఆట తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతూ దర్శకనిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అందుకే ఇతర భాషల్లోనూ విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించుకున్నారు. ఇప్పుడు తెలుగులోనూ రిలీజ్‌కు ముహూర్తం నిర్ణయించారు. కాంతారా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని ప్రముఖ అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అక్టోబరు 15న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. కాంతారా అనేది ఓ సంస్కృత పదం. తెలుగులో అడవి అని అర్థం వస్తుంది. అడవిపై మనం ఎంత ప్రేమను చూపిస్తే అంతకుమించిన ప్రేమను అందిస్తుంది.. ఎంత విద్వేషం చూపితే అంతకు మించిన విధ్వంసం జరుగుతుందన్న కాన్సెప్ట్‌తో ఎంతో ఆసక్తికరంగా ఈ సినిమాను స్వయంగా తీర్చిదిద్దాడు రిషబ్. అంతేకాదు హీరోగాను నటించి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.
#KantaraTelugu Grand Release on Oct 15th in AP/TG by #GeethaFilmsDistribution. ?
ఇవి కూడా చదవండిTelugu Trailer : https://t.co/nuRjfw2xp6 #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @gowda_sapthami @AJANEESHB @KantaraFilm @GeethaArts#KantaraTeluguOnOct15th ? pic.twitter.com/nkroXcEb3k
— Geetha Arts (@GeethaArts) October 9, 2022
కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ కాంతార నిర్మించారు. అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 60 కోట్ల రూపాయల వరకు వసూలు చేసినట్టు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అందులోనూ 57 కోట్లు ఒక్క కన్నడ రాష్ట్రం నుంచి వచ్చాయంటున్నారు. తమ సినిమాకు వస్తున్న స్పందనను చూసే ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈనెల 15న తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషల్లో కాంతారా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..